పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా షూటింగ్ చకచకా కొనసాగుతోంది. జనవరి లేదా మార్చిలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే వకీల్ సాబ్ విడుదల సమయంలో తలెత్తిన ఇబ్బందులు తెలిసిన ఓటిటి ప్లాట్ ఫారమ్ అమెజాన్ ఇప్పుడు ఈ సినిమా మీద కన్నేసినట్లు తెలుస్తోంది.
సినిమాను థియేటర్ లో విడుదల చేయకుండా నేరుగా డిజిటల్ హక్కులు ఇస్తే మాంచి రేటు ఇస్తామని నిర్మాతలు టెంప్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపు 140 కోట్ల మేరకు ఈ ఆఫర్ వున్నట్లు తెలుస్తోంది. ఈ రేంజ్ ఆఫర్ సౌత్ ఇండియాలో ఇదే ప్రధమం.
ఇది కాక శాటిలైట్, హిందీ రైట్స్, అడియో రైట్స్ వుండనే వుంటాయి. అయితే ఈ ఆఫర్ ను నిర్మాతలు తీసుకోకపోవడానికి ఎక్కువ చాన్స్ వుంది. ఇటు హీరో పవన్ కూడా ఈ విషయంలో పెద్దగా పట్టుదలతో ఏమీ లేరు. నిర్మాతకు ఎలా కన్వీనియెంట్ అయితే అలాగే చేసుకోమన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రలో టికెట్ రేట్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ పవన్ లాంటి పవర్ ఫుల్ స్టార్ సినిమాను థియేటర్ లోకి తేకుండా ఓటిటికి ఇచ్చేస్తే వ్యవహారం మామూలుగా వుండదు. ఫ్యాన్స్ ఇలాంటి అలాంటి రచ్చ చేయరు. సినిమా ఇవ్వడం వల్ల వచ్చే లాభాల కన్నా, ఫ్యాన్స్ తో వచ్చే తలకాయ నొప్పి ఎక్కువగా వుంటుంది.
అదీ కాక పవన్ రాజకీయ నాయకుడు కూడా. అందువల్ల ఆయన సినిమా కింది స్థాయి వరకు చేరాలి అంటే థియేటర్ నే శరణ్యం. అందువల్ల ఎప్పటికీ భీమ్లా నాయక్ సినిమా థియేటర్ విడుదలకే తప్ప ఒటిటి డోర్ తట్టకపోవచ్చు.