జనవరి లో జనాలను అలరించడానికి రెడీ అయిపోతోంది ఆర్ఆర్ఆర్. ఆరు నూరైనా జనవరిలో విడుదల పక్కా అనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
ఈ మేరకు డిసెంబర్ లో పబ్లిసిటీ ప్లాన్ కూడా రెడీ అయిపోతోందట. ఓ చార్టర్ ఫ్లయిట్ ను వివిధ సిటీలకు వెళ్లేందుకు రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ముంబాయి,బెంగళూరు, హైదరాబాద్, చెన్నయ్, విశాఖపట్నం లో సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లు, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లు నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇద్దరు హీరోలు, రాజమౌళి కచ్చితంగా ప్రతి మీట్ లో వుండేలా డేట్ లు ఖరారు చేస్తున్నారని తెలుస్తోంది.
కేవలం సినిమా పబ్లసిటీకే భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని పదుల కోట్లు కేవలం పబ్లిసిటీకి ఖర్చు చేయబోతున్నారని టాక్ వినిపినిస్తోంది.
బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ మీద కాస్త గట్టిగా ఖర్చు చేస్తారని టాక్. గతంలో కూడా రాజమౌళి టీమ్ ఈ దిశగానే ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. మళ్లీ అదే రూట్ లో వెళ్లబోతున్నారని తెలుస్తోంది.