ఆకాష్ పూరి, కేతిక శర్మ నటించిన ‘రొమాంటిక్’ చిత్రం దర్శకుడు అనిల్ పండూరి. సినిమా విడుదల సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
''..మాది పాలకొల్లు, నర్సాపురం. ఇంజనీరింగ్ చేసినా కూడా ఆర్ట్ మీద ఉన్న ఆసక్తితో ఇటు వైపు వచ్చాను. వీఎఫ్ఎక్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశాను. కళ్యాణ్ రామ్ గారితో కలిసి నేను ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీ ప్రారంభించాను. తారక్ గారితో టెంపర్ సినిమాను చేశాను. ఆ సమయంలోనే పూరి గారితో పరిచయం ఏర్పడింది.
అలా ఈ చిత్రం పట్టాలెక్కింది. పూరి గారు ఆయనతో పాటు రైటింగ్‌కు నన్ను తీసుకెళ్లేవారు. ఇజం సినిమా సమయంలోనే పూరి గారు నన్ను వేరే కథను డైరెక్ట్ చేయమన్నారు. కానీ అప్పుడు నా మీద నాకు అంతగా నమ్మకం లేదు. నేను రాసేవి కూడా పూరి గారికి నచ్చేవి. అలా నా మీద నమ్మకంతోనే మళ్లీ రొమాంటిక్ సినిమా కథను ఇచ్చారు. ఈ కథ కూడా నాకు బాగా నచ్చింది. అందుకే డైరెక్షన్ చేసేందుకు ఒప్పుకున్నాను.
మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథే రొమాంటిక్. ఇందులో మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. ట్రైలర్‌లో ఎక్కువగా రొమాన్స్ ఉంది కదా?అని సినిమా అంత అలానే ఉంటుందని కాదు. ఇది కేవలం యూత్ సినిమానే కాదు.. ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉంటుంది. ప్రస్తుతం ఆకర్షణనే ప్రేమ అని అనుకుంటున్నారు. అందుకే కొద్ది కాలానికే విడిపోతోన్నారు. ప్రేమ, ఆకర్షణకు మధ్య ఉన్న సన్నని గీత గురించి ఇందులో వివరించాం. ప్రేమను నమ్మని ఓ కుర్రాడు.. ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది కథ.
హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో ఇన్ స్టాగ్రాంలో కేతిక శర్మ ప్రొఫైల్ పూరి చూశారు. ఆమెను ఓకే చెప్పేశాం. అయితే కెమెరాల ముందు నటించడం ఆమెకు తెలీకపోవడంతో చాలా వర్క్ షాప్స్ పెట్టాం. ఆ తరువాత సినిమాలోకి తీసుకున్నాం. ఫైనల్ కట్ అయ్యాక ఈ చిత్రాన్ని పూరి గారికి చూపించాను. కళ్ల నీళ్లు పెట్టేసుకున్నారు. నా సినిమాలో ఇంత ఎమోషన్ ఎక్కడుందా? అని అనుకున్నాను.
రమ్యకృష్ణ రావడంతో మా సినిమా లుక్ మారిపోయింది. ఆమె స్థాయికి తగ్గ పాత్ర. ఆమె ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. సినిమా మొత్తం చూశాక సెన్సార్ సభ్యులు వెంటనే యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏడిపించారు కదా? అని అన్నారు. రేపు సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అలానే ఫీలవుతారని నా నమ్మకం