దీపావళి కానుకగా బాలయ్య, రవితేజ సినిమా విశేషాలు బయటకొచ్చాయి. కొన్ని రోజులుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. దీపావళి కానుకగా ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. అందరూ ఊహించినట్టుగానే బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమాకు రూలర్ అనే పేరుపెట్టారు. గతంలో ఎన్టీఆర్-బోయపాటి కాంబోలో వచ్చిన సినిమా కోసం ఇదే టైటిల్ ను పరిశీలించారు. ఆ తర్వాత బాలయ్య నటించిన మరో సినిమా కోసం కూడా ఈ పేరు తెరపైకొచ్చింది. అప్పుడు అలా మిస్ అయిన ఈ టైటిల్, ఇప్పుడిలా బాలయ్య ఖాతాలో చేరింది.
టైటిల్ తో పాటు సినిమాకు సంబంధించి మరో పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈసారి పోలీసాఫీసర్ గెటప్ లో పెద్ద సుత్తి పట్టుకున్న బాలయ్య ఫొటోను రిలీజ్ చేశారు. ఇంతకుముందు విడుదలైన స్టిల్స్ కు, తాజాగా రిలీజైన స్టిల్ లోని గెటప్ కు చిన్న చిన్న తేడాలున్నాయి. సినిమాలో ఈ పోలీస్ ఆఫీసర్ పేరు ధర్మ.
అటు రవితేజ కూడా తన కెరీర్ లో 66వ సినిమాను ప్రకటించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ, ఆ మూవీని ఈరోజు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు క్రాక్ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఠాగూర్ మధు నిర్మాత.
రవితేజ, మలినేని దర్శకత్వంలో గతంలో డాన్ శీను, బలుపు సినిమాలొచ్చాయి. ఈ కొత్త సినిమాకు కూడా దాదాపు అదే రకమైన హీరో క్యారెక్టరైజేషన్ రాసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో రవితేజ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. కానీ ఆ విషయాన్ని ఈరోజు ప్రకటించలేదు.