ఆ హీరోయిన్ తో అంత ఈజీ కాదు

మామూలుగానే హీరోయిన్లు వ్యవహారం ఓ రేంజ్ లో వుంటుంది. వాళ్ల డిమాండ్లు, హడావుడి తక్కువేమీ కాదు. టాలీవుడ్ లో ఓ హీరోయిన్ పేరు చెబితే నిర్మాతలు అమ్మో..అంటున్నారు. కొన్నేళ్ల కిందటి వరకు పెద్దగా బేరాలు…

మామూలుగానే హీరోయిన్లు వ్యవహారం ఓ రేంజ్ లో వుంటుంది. వాళ్ల డిమాండ్లు, హడావుడి తక్కువేమీ కాదు. టాలీవుడ్ లో ఓ హీరోయిన్ పేరు చెబితే నిర్మాతలు అమ్మో..అంటున్నారు. కొన్నేళ్ల కిందటి వరకు పెద్దగా బేరాలు లేవు ఈ అమ్మడికి. ఓ పరభాషా సినిమా హిట్ కావడంతో తెలుగులో ఒకటి రెండు చాన్స్ లు వచ్చాయి.

ఈ రెండు సినిమాల నిర్మాతలకు షూటింగ్ వున్నన్ని రోజులు సదరు హీరోయిన్ చుక్కలు చూపించేసినట్లు తెలుస్తోంది. ఏనాడూ టైమ్ కు షూటింగ్ కు వచ్చిన పాపాన పోలేదని తెలుస్తోంది. 

ఆ అమ్మడు వ్యవహారానికి పరాకాష్ట ఏమిటంటే, ఓ సినిమా విడుదల సందర్బంగా పబ్లిసిటీ కోసం ఫంక్షన్ చేసారు. ఆ ఫంక్షన్ కు హాజరు కావాలంటే, ఆ ఫంక్షన్ జరిగే ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేయాలన్నది కండిషన్ అంట. ఊళ్లేనే వుంటున్న హీరొయిన, హైదరాబాద్ లోనే ఇల్లు తీసుకుని వుంటున్న హీరోయిన్ కు మళ్లీ రూమ్ ఎందుకు అంటే, ఇంటి నుంచి హోటల్ కు వచ్చి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని ఫంక్షన్ కు వస్తుందట.  

అంతే కానీ ఇంటి నుంచి నేరుగా ఫంక్షన్ డ్రెస్ తో రాదట. ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ కావడంతో రూమ్ టారిఫ్ కూడా తక్కువేమీ వుండదు. కేవలం రెండు గంటల వ్యవహారం కోసం వేలు ఖర్చు భరించాల్సి వచ్చిందట నిర్మాతకు.