సర్కారువారిపాట ఏప్రిల్ 28

2022 సినిమా కేలండర్ ఫిల్ అయిపోతోంది. ఆర్ఆర్ఆర్ విడుదల పక్కా అని వార్తలు రావడంతో మిగిలిన భారీ సినిమాలు అన్నీ డేట్ లు సర్దుకుంటున్నాయి. ఆచార్య సినిమాకు ఇప్పటికే ఫిబ్రవరి 4 ను డేట్…

2022 సినిమా కేలండర్ ఫిల్ అయిపోతోంది. ఆర్ఆర్ఆర్ విడుదల పక్కా అని వార్తలు రావడంతో మిగిలిన భారీ సినిమాలు అన్నీ డేట్ లు సర్దుకుంటున్నాయి. ఆచార్య సినిమాకు ఇప్పటికే ఫిబ్రవరి 4 ను డేట్ గా ప్రకటించేసారు. 

అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ఎఫ్ 3 కి కూడా డేట్ ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 25న ఆ సినిమా విడుదలవుతుంది. 

అంటే సంక్రాంతి బరిలోంచి ఆ సినిమా తప్పుకున్నట్లే. భీమ్లానాయక్, సర్కారువారి పాట డేట్ లు రావాల్సి వుంది. ఏప్రిల్ 28న సర్కారువారి పాట విడుదలకు రంగం సిద్దం అవుతోంది. మార్చి 31న భీమ్లా నాయక్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. 

2021 డిసెంబర్ నుంచి వరుసగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక్కో పెద్ద సినిమా విడుదలకు రంగం సిద్దం అయిపోయినట్లే. ఇక సమ్మర్ లో పాన్ ఇండియా సినిమాలు వుండనే వున్నాయి.