ఎన్నాళ్లకెన్నాళ్ల కెన్నాళ్లకు..

ఒకప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ విజయశాంతి. తెలుగునాట మాత్రమేకాదు, తమిళనాట కూడా లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న హీరోయిన్. విజయశాంతి టాలీవుడ్ ఇన్నింగ్స్ చాలాకాలం సాగింది. రాజకీయాల్లోకి వెళ్లడంతో బ్రేక్ పడింది కానీ, లేదూ…

ఒకప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ విజయశాంతి. తెలుగునాట మాత్రమేకాదు, తమిళనాట కూడా లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న హీరోయిన్. విజయశాంతి టాలీవుడ్ ఇన్నింగ్స్ చాలాకాలం సాగింది. రాజకీయాల్లోకి వెళ్లడంతో బ్రేక్ పడింది కానీ, లేదూ అంటే ఇప్పటికీ అలాగే కొనసాగేది.

ఇప్పుడు మళ్లీ ఆ టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. మహేష్ బాబు కాంబినేషన్ లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయశాంతి మళ్లీ మొహానికి మేకప్ వేసుకున్నారు. సినిమాలో ఓ కీలకమైన (రిటైర్డ్ లెక్చరర్?) పాత్రలో ఆమె కనిపించబోతున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి లుక్ ఎలా వుండబోతోందో ఇప్పుడు బయటకు విడుదల చేసింది సినిమా టీమ్. ఇన్నాళ్లు వితవుట్ మేకప్ విజయశాంతిని చూడడం వేరు. ఇప్పుడు సినిమాటిక్ లుక్ లో చూడడం వేరు. పెద్దతరహా మహిళా పాత్రలకు విజయశాంతి పెర్ ఫెక్ట్ ఫిట్ అని ఈ స్టిల్ చెప్పకనే చెబుతోంది. రాజకీయాలు పక్కనపెట్టి విజయశాంతి సినిమాల దృష్టిపెట్టాలే కానీ అవకాశాలకు కొదవ వుండదు.

మెగా హీరోపై డైరెక్టర్ ఫన్నీ కామెంట్స్.. సరదా ఇంటర్వ్యూ