మహేష్ సినిమాలో పివిపికీ వాటా?

బ్రహ్మోత్సవం సినిమాకు ముందు నిర్మాత పివిపి హీరో మహేష్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లితో కూడా అలాంటి అగ్రిమెంట్ వుంది. కానీ…

బ్రహ్మోత్సవం సినిమాకు ముందు నిర్మాత పివిపి హీరో మహేష్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లితో కూడా అలాంటి అగ్రిమెంట్ వుంది. కానీ బ్రహ్మోత్సవం దారుణంగా ఫ్లాప్ అయిన తరువాత వ్యవహారాలు అన్నీ మారిపోయాయి.

నిజానికి అంత ఫ్లాప్ అయిన తరువాత నిర్మాతను ఆదుకోవడానికి హీరో సిన్మా చేయాల్సి వుంది. అయితే రకరకాల కారణాల వల్ల అలా జరగలేదు. దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాత పివిపితో పని చేయడానికి ఇష్టపడకుండా, దిల్ రాజు దగ్గరకు వెళ్లడం కూడా ఓ కారణం.

ఇలాంటి నేపథ్యంలో మహర్షి సినిమాను నిర్మాత పివిపి కోర్టు ద్వారా అష్ట దిగ్బంధనం చేయడంతో నిర్మాతల్లో ఆయన పేరు కూడా చేర్చక తప్పలేదు. పేరుకు నిర్మాతే కానీ ఆ సినిమా వల్ల పివిపికి నష్టమే తప్ప పైసా లాభం లేదు. ఇచ్చిన అప్పుకు వడ్డీల్లో కోత పడింది.

తన వడ్డీకి తానే పెట్టుబడి పెట్టారు. ఇలా చాలా చాలా జరిగాయి. నైజాం, కృష్ణ, వైజాగ్ వుంచుకున్నా, లాభాలు మిగలలేదు. మొత్తంమీద మహర్షి సినిమా నిర్మాత పివిపికి రూపాయి ఇవ్వలేదు. అది పచ్చి వాస్తవం. ఇప్పుడు వంశీ పైడిపల్లి-దిల్ రాజు కాంబినేషన్ లో తయారు కావాల్సిన సినిమాలో కూడా నిర్మాత పివిపికి వాటా వున్నట్లు తెలుస్తోంది.

యాభైశాతం వాటా నిర్మాత పివిపికే వున్నట్లు బోగట్టా. ఆ లెక్కన ఆ సినిమాకు నిర్మాతలకుగా దిల్ రాజు-పివిపి ఇద్దరి పేర్లు వుంటాయని తెలుస్తోంది. ఈసారి మాత్రం మహేష్ బాబు సంస్థ జిఎమ్బీ పేరు వుండకపోవచ్చు అని తెలుస్తోంది.

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే