నవ్విపోదురుకాక.. పవన్ కేంటి?

వైఎస్ జగన్ పాలనను విమర్శించడానికి చంద్రబాబుకే ధైర్యం సరిపోవడం లేదు. అందుకే అక్రమ అరెస్ట్ లంటూ అసత్యాలు ప్రచారం చేస్తూ అపనిందలు వేస్తూ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పుడు పవన్ మొదలు పెట్టారు. జగన్ పై…

వైఎస్ జగన్ పాలనను విమర్శించడానికి చంద్రబాబుకే ధైర్యం సరిపోవడం లేదు. అందుకే అక్రమ అరెస్ట్ లంటూ అసత్యాలు ప్రచారం చేస్తూ అపనిందలు వేస్తూ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పుడు పవన్ మొదలు పెట్టారు. జగన్ పై కేసుల గురించి మాట్లాడుతున్నారు జనసేనాని. జగన్ ఢిల్లీ టూర్ పై పవన్ చేసిన విమర్శలు, అతడి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలిచాయి. కేసులు ఉన్న వ్యక్తి సీఎం అయితే రాష్ట్రానికి న్యాయం జరగదని, కేసులు ఉన్నవ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేరని, పైస్థాయి వ్యక్తులతో బలంగా మాట్లాడలేరంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు పవన్.

ఆ మాట ప్రకారం కేసుల్లేని వ్యక్తి సీఎం అయితే ఆ తర్వాత ఆయనపై ఆరోపణలు రాకుండా ఉంటాయా? జగన్ పై కేసులున్నాయి కానీ ఏ ఒక్కటైనా నిరూపణ అయిందా? కొన్నిరకాల కేసుల్లో శిక్షపడితే ఎన్నికల్లో పోటీకి అర్హులు కారంటూ సాక్షాత్తూ రాజ్యాంగమే చెబుతోంది. అంటే మిగతా కేసుల విషయంలో, కేవలం విచారణ ఎదుర్కునేవారు పోటీచేయొచ్చు, పదవిలో ఉండొచ్చనే దాని అర్థం. మరి రాజ్యాంగం కంటే గొప్పగా ఆలోచించే వ్యక్తి పవన్ కల్యాణ్ అనుకోవాలా?

పోనీ పవన్ కల్యాణ్ వాదనే కరెక్ట్ అనుకుందాం. జగన్ పై పెట్టిన కేసులు ఎలాంటివి. పూర్తి రాజకీయ కక్షతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ పై బనాయించిన కేసులవి. ఇవన్నీ తెలిసి కూడా పవన్ కల్యాణ్ ఎందుకిలా మాట్లాడుతున్నారు. పోనీ పవన్ లెక్కల ప్రకారం చూసుకుంటే, ఎలాంటి కేసులు లేవని తనకుతాను చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్లలో కేంద్రంతో పోరాడి సాధించిందేంటి? అప్పుడు బీజేపీతో అంటకాగిన పవన్ కల్యాణ్ ఏం సాధించారు. పాచిపోయిన లడ్డూలంటూ సెటైర్లు వేసిన తర్వాత ఇన్నాళ్లూ పవన్ ఏం సాధించారు. ఈ విషయాలన్నీ వైసీపీవాళ్లు తిరిగి అడిగితే పవన్ తల ఎక్కడ పెట్టుకుంటారు.

అసలు ఇవన్నీ ఎందుకు. జగన్ పై అక్రమ కేసులు బనాయించారనే విషయాన్ని ప్రజలే నమ్మారు. అందుకే అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఆ విషయం పవన్ మరిచిపోతే ఎలా? నిజంగా జగన్ కేసులకు భయపడే వ్యక్తి అయితే రాష్ట్ర విభజన నుంచి ఈరోజు వరకు ప్రత్యేకహోదా అంశాన్ని ఎందుకు భుజానికెత్తుకుంటారు? నిజంగా జగన్ భయపడే వ్యక్తి అయితే, అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు పవన్ కు తెలియనివేం కావు.

ప్రస్తుతం పవన్ ప్రవర్తన చూస్తుంటే ఒక విషయం కచ్చితంగా అర్థమౌవుతుంది. కేవలం జగన్ ని టార్గెట్ చేస్తూ చంద్రబాబుని మాత్రం వదిలేస్తూ పవన్ కల్యాణ్ తనగొయ్యి తానే తవ్వుకుంటున్నారు. తన ఇమేజ్ తానే తగ్గించుకుంటున్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు ఆపేసి, పవన్ తననుతాను ఆత్మవిమర్శ చేసుకుంటే బెటరేమో!

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే