చిరంజీవి Vs బాలయ్య.. రెచ్చిపోతున్న ఫ్యాన్స్

చిరంజీవి-బాలయ్య మధ్య బాక్సాఫీస్ వార్ కొత్తేంకాదు. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు చాలాసార్లు బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డారు. అయితే ఈసారి వీళ్లిద్దరి కోసం వీళ్ల అభిమానులు కొట్టుకుంటున్నారు. అది కూడా సినిమాల పరంగా కాదు.…

చిరంజీవి-బాలయ్య మధ్య బాక్సాఫీస్ వార్ కొత్తేంకాదు. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు చాలాసార్లు బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డారు. అయితే ఈసారి వీళ్లిద్దరి కోసం వీళ్ల అభిమానులు కొట్టుకుంటున్నారు. అది కూడా సినిమాల పరంగా కాదు. తాజాగా వచ్చిన చిరంజీవి ఫొటోలు, బాలయ్య ఫొటోల్ని కంపేర్ చేస్తూ, ఈ 'కొట్టుకోవడం' మొదలైంది.

స్కంద సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు బాలయ్య. రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేసింది. ఫంక్షన్ లో ఆమెను ప్రేమపూర్వకంగా ఆశీర్వదించారు బాలయ్య. తలపై చేయి వేసి నిమిరారు. బాలయ్య ఇలా చేయడం వెనక ఓ రీజన్ ఉంది.

ప్రస్తుతం ఈ హీరో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నారు. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలయ్యకు కూతురు వరుస పాత్రలో శ్రీలీల కనిపించనుంది. ఆ వాత్సల్యంతో, స్కంద ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో బాలయ్య అలా ప్రవర్తించారు.

సరిగ్గా ఇదే మేటర్ ను పట్టుకున్నారు నందమూరి అభిమానులు. చిరంజీవికి, బాలయ్యకు ఎంత తేడానో చూడండి అంటూ చిరు పాత ఫొటోల్ని మరోసారి ట్రోల్ చేస్తున్నారు..

ఇంతకీ చిరు ఏం చేశారు..?

రీసెంట్ గా భోళాశంకర్ సినిమా చేశారు చిరంజీవి. అందులో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ నటించింది. తన కూతురు కంటే తక్కువ వయసున్న కీర్తిసురేష్ ను చిరంజీవి ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ఓ సందర్భంలో కీర్తిసురేష్ చేతిని తన చంకలో పెట్టుకున్నారు. ఇవన్నీ ఆయన ఆప్యాయంగానే చేశారు.

అయితే భోళా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో కీర్తిసురేష్ ను ఉద్దేశించి, చిరంజీవి చేసిన కామెంట్స్ కొన్ని వివాదాస్పదమయ్యాయి. చిరు తన స్థాయికి తగ్గట్టు మాట్లాడలేదనే కామెంట్స్ వినిపించాయి.

ఇప్పుడు బాలయ్య, శ్రీలీల పట్ల వ్యవహరించిన తీరుతో, చిరంజీవి అప్పట్లో చేసిన పనుల్ని మరోసారి హైలెట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. చిరంజీవికి, బాలయ్యకు చాలా తేడా ఉందంటూ తమ హీరోను ఆకాశానికెత్తేస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లేదుగా..

అయితే ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ అస్సలు తగ్గడం లేదు. గతంలో మహిళల పట్ల బాలయ్య అనుచితంగా ప్రవర్తించిన డైలాగ్స్, వీడియోస్ అన్నింటినీ వైరల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓ ఫంక్షన్ లో “ఆడది కనిపిస్తే *** చేయాలి” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు మెగా ఫ్యాన్స్.