తూర్పులో మొదలెట్టిన ఎంవీవీ

విశాఖ తూర్పు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది వలస నేతలకు అడ్డాగా మారింది. అందుకే నియోజకవర్గం ఏర్పాటుతోనే గెలిచి ఆ మీదట ముమ్మారు ఎమ్మెల్యేగా హవా చలాయిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు…

విశాఖ తూర్పు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది వలస నేతలకు అడ్డాగా మారింది. అందుకే నియోజకవర్గం ఏర్పాటుతోనే గెలిచి ఆ మీదట ముమ్మారు ఎమ్మెల్యేగా హవా చలాయిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు తూర్పుకు మొక్కుకుంటూ ఉన్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ అని చంద్రబాబు డిక్లేర్ చేయడంతో వెలగపూడి 2024లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన మీద విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను పోటీకి వైసీపీ నిలబెడుతోంది. రీసెంట్ గా ఆయనకు విశాఖ తూర్పు వైసీపీ ఇంచార్జి పదవిని కట్టబెట్టింది.

దాంతో ఎంవీవీ మొదలెట్టేశారు. విశాఖ తూర్పులో గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఆయన కార్యక్రమం ఆదివారం ఆహ్లాదవారం అనుకుని ముహూర్తంగా ప్రారంభించారు. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో కలసి ప్రతి గడపను టచ్ చేశారు.

ఎంవీవీ పొటీ అంటే ఇద్దరి బిగ్ షాట్స్ మధ్య సమరమే.అటు వెలగపూడి క్రిష్ణా జిల్లాకు చెందిన వారు అయితే ఇటు ఎంవీవీ గోదావరి జిల్లాలకు చెందిన వారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. అర్ధబలం అంగబలంలో సమ ఉజ్జీలు. ఈ ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందనే అంటున్నారు. ఎంవీవీ ఈసారి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను అంటూ తాను అనుకున్నది సాధించారు అని అంటున్నారు.