బయ్యర్ కుదేలు..కొడుకు దిగాలు

ఆయనో చిన్న సైజు బయ్యర్. ఆంధ్రలోని కీలకమైన ఏరియాలో చిన్న చిన్న సినిమాలు కొంటూ, మెల్ల మెల్లగా ఎదుగుతూ వస్తున్నారు. కొడుకు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. తండ్రి మెల్లగా ఓ రేంజ్ కు…

ఆయనో చిన్న సైజు బయ్యర్. ఆంధ్రలోని కీలకమైన ఏరియాలో చిన్న చిన్న సినిమాలు కొంటూ, మెల్ల మెల్లగా ఎదుగుతూ వస్తున్నారు. కొడుకు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. తండ్రి మెల్లగా ఓ రేంజ్ కు వెళ్తే తను కూడా అదే లైన్ లోకి వెళ్లాలనే ఆశతో వున్నాడు. కానీ వరుసగా వచ్చిన మెగా సినిమాలు అతగాడి ఆశల్ని కుదేలు చేయడం కాదు, తండ్రిని అప్పుల పాలు చేసేసాయి. లేటెస్ట్ మెగా మూవీ అయితే కోలుకోకుండా చేసేసింది.

దాంతో ఇప్పుడు కొడుకు ఇక ఆస్ట్రేలియాలో వుండడమే. అక్కడే కొన్నాళ్లు కష్టపడి మళ్లీ తండ్రిని గట్టెక్కించాల్సి వుంది. లేదంటే ఎగ్జిబిటర్లు, అప్పుల వాళ్లు ఫోన్ లు తప్పవు. టెన్షన్లు తప్పవు. 

ఒక దశలో వళ్లు మండి, హీరో వరుణ్ తేజ్ కు, ఇంత గొప్ప, ఘనమైన సినిమా తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు ఓపెన్ లెటర్లు రాద్దామని కూడా అనుకుంటున్నాడట. కోట్లకు కోట్ల రెమ్యూనిరేషన్లు తీసుకుని ఇలాంటి సినిమా అందిస్తారా అని నిలదీయాలనుకుంటున్నాడట.

కానీ దాని వలన ప్రయోజనమేమున్నది. పైగా తాము చాలా తక్కువలో తీసాం, నిర్మాతకు లాభం వచ్చేసింది ముందే అని చెప్పుకుంటారు. అలా లాభం వచ్చిన మాట నిజమైతే ఇలా దారుణంగా నష్టపోయిన వారిని ఆదుకోవచ్చు కదా? పాపం నిర్మాతే తాను ఈ సినిమా వల్ల ఇరవై కోట్లకు పైగా నష్టపోయా అన్ని సన్నిహితులతో ఆఫ్ ది రికార్డుగా చెప్పుకుని బాధ పడుతున్నారు.