అవును.. వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు

మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారంట. కొన్ని రోజులుగా బాలీవుడ్ లో వస్తున్న వార్తలివి. ఎట్టకేలకు ఈ పుకార్లకు చెక్ పడింది. ఆదివారం మలైకా-అర్జున్ కపూర్ కలిసి కనిపించారు. ఓ రెస్టారెంట్ లో భోజనం…

మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారంట. కొన్ని రోజులుగా బాలీవుడ్ లో వస్తున్న వార్తలివి. ఎట్టకేలకు ఈ పుకార్లకు చెక్ పడింది. ఆదివారం మలైకా-అర్జున్ కపూర్ కలిసి కనిపించారు. ఓ రెస్టారెంట్ లో భోజనం చేసిన తర్వాత వీళ్లిద్దరూ కలిసి మలైకా ఇంటికి వెళ్లారు.

మలైకా-అర్జున్ కలిసి కనిపించడంతో ఇన్నాళ్లూ వినిపిస్తున్న ఊహాగానాలకు చెక్ పడింది. తమ డేటింగ్ ను కొనసాగిస్తున్నట్టు వీళ్లు తాజా ఫొటోలతో పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టయింది.

ఇంతకీ ఏం జరిగింది.. కొన్ని రోజుల కిందటి సంగతి. ఉన్నట్టుండి సడెన్ గా అర్జున్ కపూర్ ను అన్-ఫాలో చేసింది మలైకా అరోరా. అక్కడితో ఆగకుండా, అర్జున్ చెల్లెలు జాన్వి కపూర్ ను కూడా అన్-ఫాలో చేసింది. అలా పూర్తిగా కపూర్ కుటుంబానికి దూరం జరిగింది.

దీంతో వీళ్లిద్దరూ విడిపోయారని అంతా అనుకున్నారు. దీనికి బాలీవుడ్ మీడియా ఓ కారణం కూడా వెదికింది. ఈమధ్య అర్జున్ కపూర్, మరో అమ్మాయికి కనెక్ట్ అయ్యాడట. నటి, ఇన్ ఫ్లూయన్సర్ కుషా కపిలకు అర్జున్ కనెక్ట్ అయ్యాడంటూ కథనాలు వచ్చాయి. రీసెంట్ గా తన భర్తకు విడాకులిచ్చింది కుషా. దీంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి.

ఈ క్రమంలో మలైకా, తన ఇన్ స్టాగ్రామ్ పేజీ నుంచి అర్జున్ కపూర్ ను తప్పించింది. అలా ఇద్దరూ విడిపోయారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఇద్దరూ కలిశారు. పొట్టి నిక్కరు వేసుకొని మలైకా, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో అర్జున్ కపూర్ రెస్టారెంట్ కు వచ్చారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత మలైకా ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం మలైకా వయసు 49 సంవత్సరాలు కాగా, అర్జున్ కపూర్ వయసు 38 ఏళ్లు.