అక్టోబర్ లో ‘సొలో బతుకు’

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రియల్ లోనే విడుదలైపోవాల్సిన సినిమా సోలో బతుకే సో బెటరు. కానీ కరోనా వల్ల ఆగిపోయింది. ఈ సినిమాను జీ టీవీ ఓటిటి జీ 5 కు ఇచ్చేసారని 'గ్రేట్…

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రియల్ లోనే విడుదలైపోవాల్సిన సినిమా సోలో బతుకే సో బెటరు. కానీ కరోనా వల్ల ఆగిపోయింది. ఈ సినిమాను జీ టీవీ ఓటిటి జీ 5 కు ఇచ్చేసారని 'గ్రేట్ ఆంధ్ర' వెల్లడించిన సంగతి తెలిసిందే. డీల్ దాదాపు క్లోజింగ్ స్టేజ్ లో వుంది. దీంతో పాటు నిత్యా మీనన్ కీలకపాత్రలో నటించిన చిన్న సినిమా కలిపి ఇస్తున్నారు.

ఇదిలా వుంటే సోలో బతుకు సినిమాకు రెండున్నర పాటలు మాత్రం షూట్ చేయాల్సి వుంది. ఓ పాట బెంగళూరు బ్యాక్ డ్రాప్ లో, మరోపాట ఫారిన్ లో షూట్ చేయాలి. ఇప్పుడు ఆ ప్లాన్ మారింది. ఓ పాటను హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్ లో, మరోపాటను రామోజీ ఫిలిం సిటీలోని విదేశీ లోకేషన్లలో తీసేస్తారు. నెలాఖరులో షూట్ స్టార్ట్ చేసి పది రోజుల్లో ఫినిష్ చేయాలన్నది ప్లాన్.

జీ 5 ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ అయిపోయింది. సెకండాఫ్ వుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా తయారవుతున్న ఈ సినిమాకు సుబ్బు దర్శకుడు.

కర్నూలు వైరస్ కథ

మెగా రెమ్యూనిరేషన్?