పెళ్లి కూతురి గెట‌ప్‌లో నిహారిక‌

మెగా ఆడ‌బిడ్డ‌, హీరోయిన్ నిహారిక‌కు పెళ్లి ఖాయ‌మైన విష‌యం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక పెళ్లి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుంది. బ‌హుశా ఈ ఏడాది…

మెగా ఆడ‌బిడ్డ‌, హీరోయిన్ నిహారిక‌కు పెళ్లి ఖాయ‌మైన విష‌యం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక పెళ్లి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుంది. బ‌హుశా ఈ ఏడాది చివ‌ర్లో మంచి ముహూర్తం చేసుకుని నిహారిక‌, చైత‌న్య జంట మూడు ముళ్ల బంధంతో ఏడ‌డుగులు న‌డ‌వ‌నుంది.

ఇదిలా ఉంటే ఆ పెళ్లి కంటే ముందే నిహారిక పెళ్లి కూతురి గెట‌ప్‌లో అభిమానుల్ని అల‌రించ‌నున్నారు. నాగ‌బాబు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఓ షో కోసం నిహారిక పెళ్లి కూతురి గెట‌ప్‌లో ముస్తాబు కానున్న‌ట్టు స‌మాచారం. దీంతో నిహారిక ఒకింత థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

నాగ‌బాబు హోస్ట్‌గా , నిహారిక పెళ్లి కుమార్తెగా క‌నిపించ‌నున్న  ఆ షో… వినాయక చవితి సందర్భంగా ఓ ఛానెల్‌లో “బాపు బొమ్మకు పెళ్లి” అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రసారం కాబోతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో కాబోయే పెళ్లి కూతురు నిహారిక పెళ్లి విశేషాలు చెప్ప‌డం ఆస‌క్తిగా మారింది. నిహారిక చెప్ప‌బోయే పెళ్లి విశేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తామ‌ని, స్ఫూర్తిదాయ‌కంగా ఉంటాయ‌నే టాక్ వినిపిస్తోంది. తిన‌బోతు రుచి చూడ‌డం ఎందుకు? ఒకే సారి ఆ కార్య‌క్ర‌మాన్నే అసాంతం ఆస్వాదిస్తే ఆ థ్రిల్లే వేరు క‌దా? 

కర్నూలు వైరస్ కథ

మెగా రెమ్యూనిరేషన్?