జగన్ చాలా విషయాల్లో బాబు కంటే బెటర్ కాబట్టే చరిత్ర ఎరగని విజయాన్ని 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు కట్టబెట్టారు. జగన్ సైతం అలుపెరగకుండా పనిచేస్తూ వారు రుణాన్ని తీర్చుకుంటున్నారు. తొలి ఏడాదిలోనే తొంబై శాతానికి పైగా హామీలను నెరవేర్చారు కూడా.
ఇవన్నీ ఇలా ఉంటే మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కంటే జగన్ చాలా బెటర్ అంటో మళ్ళీ ట్వీటారు. పెద్దాయన బాబుకు ఇది షాక్ లాంటిదే అయినా సంచయిత ఉన్నది ఉన్నట్లుగానే చెప్పారనుకోవాలి.
లేకపోతే సుప్రీంకోర్టు పురుషులతో సమానంగా మహిళలకు ఆస్థి హక్కు వారసత్వంగా ఇస్తూ తీర్పు చెబితే బహు బాగు అంటూ తండ్రీ కొడుకులుచంద్రబాబు, లోకేష్ బాబు చప్పట్లు కొట్టారు. బాబు అయితే మరో అడుగు ముందుకేసి సుప్రీంకోర్టు తీర్పు కంటే చాలా ముందే టీడీపీ దీన్ని అమల్లో పెట్టిందని గొప్పలు చెప్పుకున్నారు.
సరే బాబు మాటలు, చేతలకు మధ్య ఎంత దూరం అన్నది అందరికీ తెలిసిందే. దాన్ని బయటేసి బాబోరికి షాక్ ఇవ్వడంలోనే సంచయిత టైమింగ్ అదిరింది. తాను మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ అయితే ఏ హోదా అవుతారు, ఆడబిడ్డలకు ఈ పదవిలో కూర్చునే అర్హత లేనట్లుగా తన బాబాయి అశోక్ తో పాటు, చంద్రబాబు మాట్లాడిన సంగతిని సంచయిత గుర్తు చేసి మరీ గాలి తీసేశారు.
ఆడబిడ్డలు అన్నింటా సమానమని ఇపుడు గట్టిగా చెబుతున్న బాబుకు తాను మాన్సాస్ చైర్ పర్సన్ అయితే మాత్రం ఎందుకు అభ్యంతరమని పూసపాటి వారి యువరాణి సూటిగానే ప్రశ్నించారు. మీరు సుప్రీం తీర్పుని బాగా అర్ధం చేసుకుంటే ముందు నా మీద దాడిని ఆపండి. మా బాబాయి కి కూడా ఆ విషయం చెప్పండి, నేను చట్టబద్ధంగా పూసపాటి వారి వారసురాలని అని మరోమారు సంచయిత గర్జిస్తున్నారు. ఇక మాటలతో కాకుండా చేతల్లో మహిళా సాధికారికత చూపించే సీఎం జగన్ అంటూ కితాబు ఇచ్చేశారు. మొత్తానికి బాబు కంటే జగన్ బెటర్ అంటున్న సంచయిత షాక్ కి బాబు దగ్గర కౌంటర్ ఉంటుందా.