ఢిల్లీలోని సైనిక్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆరోగ్యాన్ని దేవుని విచక్షణకు ఆయన కూతురు , కాంగ్రెస్ నాయకురాలు షర్మిష్ట విడిచిపెట్టారు. ఈ మేరకు ఆమె బుధవారం ట్వీట్ చేశారు. మెదడు రక్త నాళాల్లో గడ్డ కట్టడంతో సోమవారం చికిత్స చేశారు. అంతేకాకుండా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 84 ఏళ్ల ప్రణబ్ వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్నట్టు వైద్యుల నుంచి అందుతున్న సమాచారం.
ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. తండ్రి ఆరోగ్యం గురించి దేవునిపై భారం వేయడాన్ని బట్టి ప్రణబ్ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రణబ్ కుమార్తె ట్వీట్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
‘గత సంవత్సరం ఆగస్టు 8 నాకు చాలా సంతోషం ఇచ్చిన రోజు. ఎందుకంటే ఆ రోజు మా నాన్న అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న అందుకున్నారు. ఓ సంవత్సరం తిరిగేసరికి ఇదే ఆగస్టు 10వ రోజున నానా చాలా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన విషయంలో భగవంతుడికి ఏది సరైందనిపిస్తే అదే చేస్తే బాగుంటుంది. ఆనందాన్నైనా… బాధనైనా తట్టుకునే శక్తిని భగవంతుడు నాకు ప్రసాదించాలి’ అని షర్మిష్ఠ ప్రకటించారు. భావోద్వేగమైన శర్మిష్ట పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.