Advertisement

Advertisement


Home > Movies - Movie News

శ్రీదేవి కూతురు సినిమాపై వైమానిక దళం ఆగ్రహం

శ్రీదేవి కూతురు సినిమాపై వైమానిక దళం ఆగ్రహం

జాన్వి కపూర్ లీడ్ రోల్ పోషించిన సినిమా గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్. ఈరోజు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమాపై భారత వైమానిక దళం అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డ్ కు లేఖ రాసింది. ఇదే లేఖను ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కు, ప్రొడక్షన్ సంస్థ ధర్మ ప్రొడక్షన్ కు కూడా పంపించింది.

కొన్ని రోజుల కిందట గుంజన్ సక్సేనా మూవీ ట్రయిలర్ రిలీజైంది. ఈ ట్రయిలర్ లో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు వైమానిక దళాన్ని నెగెటివ్ గా చూపించేలా ఉన్నాయని ఎయిర్ ఫోర్స్ అభిప్రాయపడింది. తమ అభ్యంతరాల్ని లేఖలో సవివరంగా వివరించింది.

నిజానికి ఈ సినిమాను తెరకెక్కించే ముందు.. ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ, ఎయిర్ ఫోర్స్ కు పూర్తి హామీ ఇచ్చిందట. వైమానిక దళం గౌరవాన్ని పెంచేలా, భవిష్యత్ తరాలకు ఎయిర్ ఫోర్స్ ఆదర్శవంతంగా ఉండేలా సినిమాను తెరకెక్కిస్తామని చెప్పిందట. కానీ ట్రయిలర్ చూస్తే తమకు సదరు సంస్థపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని వైమానిక దళం తన లేఖలో పేర్కొంది.

లింగబేధాన్ని ఎత్తిచూపించేలా కొన్ని సన్నివేశాలున్నాయని ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం వ్యక్తంచేసింది. వైమానిక దళంలో ఎలాంటి లింగ బేధం ఉండదని, మరీ ముఖ్యంగా ఆడ-మగ మధ్య తేడాలు చూపించమని తెలిపిన ఎయిర్ ఫోర్స్.. అందుకు సంబంధించిన దృశ్యాల్ని తొలిగించడం లేదా మార్చడం చేయాలని సూచించింది.

అయితే ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఈరోజు గుంజన్ సక్సేనా సినిమా ఓటీటీ వేదికపైకి వచ్చేసింది. పైగా సెన్సార్ తో సంబంధంలేని మాధ్యమం ఇది. కాబట్టి దీనిపై ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ తీసుకునే నిర్ణయమే అంతిమం అవుతుంది. మరి ఆ సంస్థ అధినేత కరణ్ జోహార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

వైఎస్సార్ చేయూత

పవన్ కళ్యాణ్ చదివినన్ని బుక్స్ ఏ హీరో చదవలేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?