ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ… తెలిసింది ఇంతేనా…?

మాటాడితే చాలు తాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని అని చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన పద్నాలుగేళ్ల పాటు సీఎంగా, పన్నెండేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. అలాంటి చంద్రబాబు ఈ మధ్య బొత్తిగా…

మాటాడితే చాలు తాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని అని చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన పద్నాలుగేళ్ల పాటు సీఎంగా, పన్నెండేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. అలాంటి చంద్రబాబు ఈ మధ్య బొత్తిగా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు అంటున్నారు వైసీపీ నేతలు.

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టమని పదే పదే డిమాండ్ చేస్తున్న చంద్రబాబుకు అది ఎపుడుపెడతారో,  ఎలాంటి సిట్యువేషన్స్ లో తెలియకపోవడమే దారుణాతి దారుణమని మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. సిల్లీ రీజన్స్ తోనే, తమ అక్కసు కోసమే, అధికారం చేజారిందనో రాష్ట్రపతి పాలన పెట్టమంటే పెడతారా బాబూ అని అవంతి నిలదీశారు.

ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకా, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అన్ని పధకాలు ఇస్తున్నందుకా రాష్ట్రపతి పాలన పెట్టాలా బాబూ అని ఆయన గద్దించారు. తనకు అధికారం ఇవ్వని ప్రజలు కూడా బాబుకు ఇష్టం లేకుండా ఉన్నారని, అందుకే ఎక్కడో పరాయి రాష్ట్రలో కూర్చుని ఏపీని అన్ని విధాలుగా దెబ్బ తీయాలని చూస్తున్నారని విమర్శించారు.

పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఒక్కసారి అధికారం ఇవ్వకపోతే అంత బాధా అని కూడా అవంతి ఫైర్ అయ్యారు.  ఏపీ సీఎం పదవిలో చంద్రబాబు మాత్రమే కూర్చోవాలా, వేరెవరూ కూర్చోకూడదా అని ఆయన ప్రశ్నించారు. 

ఆ పదవి మీకు మాతమే సొంతమా బాబూ, ఇదేమి రాజకీయ దుర్నీతి అంటూ చెడుగుడు ఆడేసుకున్నారు మంత్రి గారు. జగన్ మీద వైసీపీ మీద టీడీపీ చేస్తున్న ఆరోపణలు నిరూపించకపోతే బాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని అవంతి సవాల్ చేశారు. మొత్తానికి బాబు చిటికేస్తే ఎపీలో ఏమీ జరిగిపోవని కూడా స్పష్టంగా చెప్పేశారు.