తనకు కుల పిచ్చి లేదని పదే పదే చెప్పుకుంటున్నా, చంద్రబాబు నాయుడు స్వకుల ప్రయోజనాల కోసమే పనిచేస్తారనే ఆరోపణలు, అభిప్రాయాలు కూడా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. విజయవాడ రమేష్ ఆసుపత్రి ఘటన మీద చంద్రబాబు నాయుడు దూకుడుగా స్పందించకపోవడం, స్పందించినప్పుడు కనీసం ఆ ఆసుపత్రి పేరును ప్రస్తావించకపోవడం చంద్రబాబు నాయుడులో ఉన్న స్వకులాభిమానానికి నిదర్శనం అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ఏపీలో ఎక్కడ ఏం జరిగినా.. ఆ వ్యవహారాలపై గగ్గోలు పెట్టే చంద్రబాబు నాయుడు రమేష్ చౌదరి విషయంలో మాత్రం కామ్ అయిపోయారని, ఎక్కువ స్పందిస్తే తమ కులస్తుడికి ఇబ్బంది కలుగుతుందని చంద్రబాబు నాయుడు ఆ విషయంపై స్పందించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తనకు కుల పిచ్చిని ఆపాదిస్తున్నారని చంద్రబాబు నాయుడు జూమ్ వీడియోలో చెప్పుకొచ్చిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన స్వకులాభిమానాన్ని ఈ ఉదంతాలు హైలెట్ చేస్తున్నాయి.
ఆ సంగతలా ఉంటే..మరో చౌదరి కోసం ఏపీ డీజీపీకి చంద్రబాబు నాయుడు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఆ చౌదరిపై అనవసరంగా కేసులు పెట్టారని చంద్రబాబు నాయుడు అంటున్నారట. వాటిని ఎత్తేయాలని ఏపీ డీజీపీకి ఆయన లేఖ రాసినట్టుగా సమాచారం. చిత్తూరు జిల్లాకు చెందిన రాకేష్ చౌదరిపై అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు నాయుడు స్వయంగా ఏపీ డీజీపీకి లేఖ రాయడం గమనార్హం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద రాకేష్ చౌదరి అనుచిత పోస్టులు పెట్టారని, కేసులు నమోదు చేశారని అది తగదని చంద్రబాబు నాయుడు ఆ లేఖలో పేర్కొన్నట్టుగా సమాచారం.
సోషల్ మీడియాలో కొందరు హద్దుమీరి పోస్టులు పెట్టడం, నీఛ కామెంట్లు పెట్టడం.. వాటిపై కేసులు.. ఇవన్నీ రొటీన్ అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో రాకేష్ చౌదరి అనే కార్యకర్త విషయంలో స్వయంగా చంద్రబాబు నాయుడే లేఖ కు పూనుకోవడం గమనార్హం.