కొంతమంది హీరోయిన్లు 40కు రీచ్ అయినా పెళ్లి వైపు మొగ్గరు. మరి కొందరు పెళ్లి చేసుకున్నా సినిమాలు చేస్తూ పిల్లల ఊసే ఎత్తరు. వారికి భిన్నంగా వస్తున్న సినిమా అవకాశాలను చూసుకోకుండా పిల్లల మీద దృష్టి పెట్టింది కరీనా కపూర్. సైఫ్ అలీఖాన్ తో పెళ్లి అనంతరం కరీనా ఇప్పటికే ఒక పిల్లాడికి జన్మనిచ్చింది. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. కరీనా కపూర్ మళ్లీ తల్లి కాబోతోందనే ఊహాగానాలు వ్యక్తం అవుతూ ఉండటం.
ఇది వరకే కరీనా తమ కుటుంబాన్ని మరింతగా పెంచుకునే ఆలోచన ఉన్నట్టుగా ప్రకటించింది. తొలి సంతానం కలిగిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మరో బిడ్డను పొందే ఆలోచన ఉన్నట్టుగా ఆమె గతంలోనే టాక్ షో ల్లో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఇప్పుడు కరీనా మరో సారి ప్రెగ్నెంట్ అనే వార్తలు బాలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తూ ఉన్నాయి.
లాక్ డౌన్ నేపథ్యంలో అటు కరీనాకు సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమె ప్రెగ్నెంట్ అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆమెకు చేతిలో సినిమాలున్నాయి. కరణ్ జొహార్ సినిమా ఒకదాంట్లో, ఆమిర్ ఖాన్ సినిమా ఒక దాంట్లో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది. ప్రెగ్నెన్సీ విషయంలో సైఫ్, కరీనాలు ఇంకా అధికారికంగా స్పందించలేదు.