మహేష్-అచ్చమైన నేటివ్ కథ

త్రివిక్రమ్ అ..ఆ సినిమా చూస్తే ఎలా వుంటుంది. అచ్చమైన తెలుగు లోగిళ్ల కథ కదా అది. మరీ పగలు..ప్రతీకారాలూ ఏమీ వుండదు. చిన్న చిన్న ఇగోల వల్ల వచ్చిన సమస్యలు తప్ప. సినిమా అంతా…

త్రివిక్రమ్ అ..ఆ సినిమా చూస్తే ఎలా వుంటుంది. అచ్చమైన తెలుగు లోగిళ్ల కథ కదా అది. మరీ పగలు..ప్రతీకారాలూ ఏమీ వుండదు. చిన్న చిన్న ఇగోల వల్ల వచ్చిన సమస్యలు తప్ప. సినిమా అంతా చాలా కూల్ గా, నెమ్మదిగా సాగిపోతుంది. బహుశా త్రివిక్రమ్ సినిమాల్లోనే ఇంత నెమ్మదైన సినిమా, అందమైన సినిమ మరోటి లేదేమో?.

ఇప్పుడు మళ్లీ అలాంటి నేటివ్ సినిమానే త్రివిక్రమ్ చేయబోతున్నారట మహేష్ బాబుతో. అయితే మరీ అలా అని అ..ఆ మాదిరిగా కాదు. మహేష్ రేంజ్ ఫైట్లు, పాటలు, హెవీ నెస్ వుంటుంది. కానీ పక్కా ఫ్యామిలీ సినిమా. ఆంధ్ర బ్యాక్ డ్రాప్ సినిమా. ఇంకా చెప్పాలంటే మహేష్ మూలాలు వున్న గుంటూరు లాంటి ప్రాంతీయ సినిమా.

దీనికి మహేష్ లెవెల్ చమక్కలు అద్దుతారు త్రివిక్రమ్. బలమైన విలనీ..పగలు..ప్రతీకారాలు వంటి వ్యవహారాలు వుండవన్నమాట. అలాగే పక్క భాషల నుంచి నటులను తెచ్చుకోవడం మీద కీలక దృష్టి వుండదు. ఎక్కువ మంది అంతా మన తెలుగు వాళ్లకు బాగా పరిచయం అయిన వారే. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, మురళీశర్మ ఇలా అన్నమాట.

ఇప్పటికే పూజా హెగ్డే, రష్మిక పేర్లు తెలిసాయి. ధమన్ సంగీతం ఫిక్స్ అయింది. పాటల వర్క్ జరుగుతోంది. జనవరి నుంచి మార్చి వరకు లెంగ్తీ షెడ్యూలు. ఈ సినిమా తరువాత మహేష్ చేయబోయే రాజమౌళి సినిమా యాక్షన్ తో కూడినదే అని వార్తలు వున్నాయి. అందుకే త్రివిక్రమ్ కు పట్టున్న ఫ్యామిలీ సబ్జెక్ట్ ను మహేష్ ఎంచుకున్నాడన్నమాట.