మొన్నటివరకు ఆమెది గోల్డెన్ హ్యాండ్. పూజా అడుగుపెడితే చాలు సగం పనైపోయినట్టేనని మేకర్స్ ఫీలయ్యేంత సెంటిమెంట్ క్రియేట్ చేసింది ఈ పొడుగుకాళ్ల సుందరి. కానీ 2022లో ఆమె లక్ పోయింది. మరోసారి ఐరెన్ లెగ్ ఇమేజ్ కు దగ్గరైంది.
ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ సినిమా చేసింది పూజాహెగ్డే. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది ఆ మూవీ. ఇక చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్య సినిమా కూడా డిజాస్టర్ అయింది.
ఇలా రెండు భారీ తెలుగు సినిమాల్లో నటించిన పూజాహెగ్డే, తన లక్ ను కొనసాగించలేకపోయింది. వరుసగా 2 ఫ్లాపులు అందుకుంది. అయితే ఆమె ప్రభావం ఈ రెండు సినిమాలతో ఆగలేదు.
తమిళ్ లో విజయ్ సరసన బీస్ట్ అనే సినిమా చేసింది ఈ బ్యూటీ. తొలిసారి విజయ్ సరసన నటించి అతడి సక్సెస్ ట్రాక్ కు బ్రేకులేసింది. బీస్ట్ సినిమా విమర్శలపాలైంది. ఎన్నడూలేని విధంగా విజయ్ డెసిషన్ మేకింగ్ పై కోలీవుడ్ లో విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక బాలీవుడ్ లో కూడా పూజా ప్రభావం కొనసాగింది. ఆమె నటించిన సర్కస్ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్. ఆక్యుపెన్సీ అయితే మరీ ఘోరం.
ఇలా 2022 సంవత్సరంలో 3 భాషల్లో 4 సినిమాలు చేసిన పూజా పాప.. ప్రతి ఇండస్ట్రీలో ఫ్లాప్ అందుకుంది. “లైఫ్ అంటే ఇట్టా ఉండాలా” అంటూ ఆమె ఈ ఏడాది ఓ ఐటెంసాంగ్ కూడా చేసింది.