కొత్త ఔరంగజేబు వచ్చాడు

హరిహర వీరమల్లు సినిమా కొత్త దశలోకి ఎంటరైంది. ఈ ప్రాజెక్టులోకి కొత్త నటుడు వచ్చి చేరాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చాడు. బాబి తొలి తెలుగు సినిమా…

హరిహర వీరమల్లు సినిమా కొత్త దశలోకి ఎంటరైంది. ఈ ప్రాజెక్టులోకి కొత్త నటుడు వచ్చి చేరాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చాడు. బాబి తొలి తెలుగు సినిమా ఇది.

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడు బాబి డియోల్.

ఔరంగజేబు పై తీసే సన్నివేశాల కోసం హైదరాబాద్ లో భారీ దర్బార్ సెట్ వేశారు. తోట తరణి ఈ సెట్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సెట్ లోనే ప్రస్తుతం పవన్-బాబి డియోల్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

బాబి డియోల్ సెట్స్ పైకి వచ్చిన విషయాన్ని తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది యూనిట్. ఆ వీడియోలో కారులోంచి దిగిన బాబి డియోల్ ను చూపించారు. నిర్మాత ఏఎం రత్నం, బాబిని సాదరంగా సెట్ లోకి ఆహ్వానించడం వరకు వీడియో ఉంది.

నిజానికి ఈ సినిమాలో ఈ పాత్ర కోసం ముందుగా అర్జున్ రాంపాల్ ను అనుకున్నారు. అతడి చెల్లెలి పాత్రలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను అనుకున్నారు. ఇప్పుడు అర్జున్ రాంపాల్ స్థానంలో బాబి డియోల్ ను తీసుకున్నారు.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో అనసూయ కనిపించనుంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.