జగన్ని అడ్డుకుంటానంటున్న అయ్యన్న…?

మూడున్నరేళ్ళ తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా నర్శీపట్నం వస్తున్నారు. ఈ నెల 28న జగన్ నర్శీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా వైద్య కళాశాలకు ఆయన శంకుస్థాపన…

మూడున్నరేళ్ళ తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా నర్శీపట్నం వస్తున్నారు. ఈ నెల 28న జగన్ నర్శీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా వైద్య కళాశాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే ఇతర ప్రాజెక్టులకు కూడా ప్రారంభం చేస్తారు.

జగన్ నర్శీపట్నం వస్తున్న నేపధ్యంలో వైసీపీ సీఎం కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో నర్శీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జగన్ నర్శీపట్నం వస్తే అడ్డుకుంటామని సంచలన ప్రకటన చేశారు. జగన్ నర్శీపట్నంలో అడుగుపెట్టేందుకు వీలులేదని అంటున్నారు.

దానికి బదులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ అయ్యన్నకు సవాల్ చేశారు. సీఎం సభను అడ్డుకుంటామని, జగన్ని నర్శీపట్నంలో అడుగుపెట్ట అడుగుపెట్టనీయమని అంటున్నారని, అయ్యన్నకు సత్తా ఉంటే జగన్ సభకు రావాలని డిమాండ్ చేశారు. వేలాది మందితో సీఎం సభ జరుపుతూంటే ఓర్వలేని అయ్యన ముఖ్యమంత్రినే అడ్డుకుంటామని ప్రగల్బాలు పలుకుతున్నారని, ఆయన తన మాట మీద నిలబడి సభకు రావాలని పెట్ల కోరారు.

రైతులను అన్ని విధాలుగా మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ అని రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి వారిని నట్టేట ముంచినది చంద్రబాబు అయ్యన్న కారా అని ఆయన నిలదీస్తున్నారు. తనకంటే పెద్ద నాయకుడు టీడీపీలో ఎవరూ లేరరని అయ్యన్న పూటకో మారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారని కానీ ఆయన సంగతి శక్తి నర్శీపట్నం జనాలకు ఎరుకే అని పెట్ల కామెంట్స్ చేశారు. ఇంతకీ జగన్ సభకు అయ్యన్న వస్తారా అడ్డుకుంటారా ఏమో మాజీ మంత్రి మాటలకు అర్ధాలువేరుగా ఉంటాయి.