బుజ్జిగాడు సినిమాలో అందర్నీ డార్లింగ్ అని పిలుస్తుంటాడు ప్రభాస్. అక్కడ్నుంచే ప్రభాస్ కు ఆ పదం అలవాటు అయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆ పదం వెనక సీక్రెట్ బయటపెట్టాడు ప్రభాస్. బుజ్జిగాడు కంటే ముందే ఫ్రెండ్ సర్కిల్స్ లో తను డార్లింగ్ అంటుంటానని, కానీ సెట్స్ పై ఆ పదం వాడింది మాత్రం బుజ్జిగాడు సినిమా నుంచే అని చెప్పుకొచ్చాడు.
“డార్లింగ్ అని ఫ్రెండ్ సర్కిల్ లో పిలుస్తాను. సెట్స్ లో మాత్రం పూరి జగన్నాద్ తోనే అలవాటైంది. పూరిని పూరి గారు, పూరి సర్ అని పిలవాలనిపించలేదు. బుజ్జిగాడు సినిమాకు ముందే డార్లింగ్ అని పిలవడం అలవాటు. కానీ బుజ్జిగాడు నుంచి పూరిని డార్లింగ్ అని తెలియకుండానే పిలిచేశాను. అది పూరికి నచ్చి,
సినిమాలో కూడా పెట్టేశారు.”
ప్రస్తుతం ఇండస్ట్రీలో అందర్నీ డార్లింగ్ అనే పిలుస్తానని, అలా పిలవకపోతే చాలామంది హర్ట్ అయిపోతున్నారని జోక్ చేశాడు ప్రభాస్. ఈ డార్లింగ్ అనే పదంపై పూరి జగన్నాధ్ కూడా రెస్పాండ్ అయ్యాడు.
“బుజ్జిగాడు సెట్స్ పై నన్ను డార్లింగ్ అని పిలుస్తుంటే చాలా పొంగిపోయాను. నన్ను మాత్రం అలా పిలుస్తున్నాడని అనుకున్నాను. నేను చాలా స్పెషల్ అనుకున్నాను. కానీ కారు డ్రైవర్ ను, మిగతా వాళ్లని కూడా డార్లింగ్ అని పిలుస్తున్నాడు. ప్రభాస్ కు అది ఊతపదమని నాకు అప్పుడు అర్థమైంది.”
ప్రభాస్ కు డార్లింగ్ అనే పదాన్ని పూరి జగన్నాధ్ అలవాటు చేశాడని చాలామంది అనుకుంటారు. కానీ పూరి జగన్నాధ్ కే ప్రభాస్ ఆ పదాన్ని అలవాటు చేశాడనే విషయం ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది.