రష్మిక.. ఈ అమ్మాయి చాలా బోల్డ్ గురూ..!

రష్మిక డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అని అందరికీ తెలుసు. చాలాసార్లు ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్లు ఓ రేంజ్ లో కాంట్రవర్సీగా మారాయి. ఇండస్ట్రీకొచ్చిన కొత్తల్లోనే రష్మిక మాటల తూటాలు పేల్చి కాంట్రవర్సీ…

రష్మిక డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అని అందరికీ తెలుసు. చాలాసార్లు ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్లు ఓ రేంజ్ లో కాంట్రవర్సీగా మారాయి. ఇండస్ట్రీకొచ్చిన కొత్తల్లోనే రష్మిక మాటల తూటాలు పేల్చి కాంట్రవర్సీ క్వీన్ గా మారింది.

ఒకటా రెండా.. ఇప్పటికే ఐదుసార్లు రష్మిక సెన్సేషనల్ స్టేట్ మెంట్లు ఇచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పటికే చాలా సార్లు గొడవలై, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నా.. ఇంకా ఆమె ఆ అలవాటు మానుకోలేకపోవడం విశేషం.

యశ్ తో మొదలై..

కన్నడ స్టార్ హీరో యశ్ ని 'షో ఆఫ్' గా పేర్కొంటూ గతంలో రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆ పదానికి రకరకాల అర్థాలున్నా.. అవసరమైనదానికంటే ఎక్కువగా బిల్డప్ ఇచ్చేవారు అనే మీనింగ్ లోనే సదరు ఇంటర్వ్యూలో రష్మికను ప్రశ్న అడిగారు. మాట దాటేయకుండా కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్ షో ఆఫ్.. యశ్ అంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత యశ్ ఫ్యాన్స్ రష్మికను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకోవడం, ఆమె క్షమాపణలు చెప్పడం, యశ్ గొప్పవాడంటూ పొగడ్తల్లో ముంచెత్తడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఆ తర్వాత ఓసారి రష్మిక చిన్ననాటి ఫొటోలతో జరిగిన ట్రోలింగ్ కి గట్టిగా సమాధానమిచ్చి అందరికీ షాకిచ్చింది. తన చిన్నప్పటి ఫొటోలతో ట్రోల్ చేయడం, తనను బాధించడంలో కొంతమంది సక్సెస్ అయ్యారని, కానీ భవిష్యత్తులో వారు అంతకు అంత అనుభవిస్తారని శాపనార్థాలు పెట్టింది. కత్తిలాంటి అమ్మాయి చిన్నప్పటి ఫొటో అంటూ అప్పట్లో రష్మిక ఫొటోలతో పెద్ద ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

మీ చిన్నప్పటి క్రష్ ఎవరంటే.. చాలామంది ఏదేదో చెప్పి తప్పించుకుంటారు. కానీ రష్మిక మాత్రం హీరో విజయ్ అని గడుసుగా చెబుతుంది. చిన్నప్పటి నుంచి హీరో విజయ్ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయనపై తనకు విపరీతమైన ప్రేమ ఉందని చెప్పేది రష్మిక. చిన్నప్పటినుంచి విజయ్ ని చూస్తున్నానని చెప్పడం బాగానే ఉన్నా.. తనకంటే వయసులో బాగా పెద్దవాడైన విజయ్ ని లవ్ చేస్తున్నాననే బోల్డ్ స్టేట్ మెంట్ ఇవ్వడం మాత్రం రష్మికకే చెల్లింది.

బాలీవుడ్ లో ప్రయోగాలు..

బాలీవుడ్ కి వెళ్తున్న క్రమంలో.. అక్కడ ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధం అని చెప్పింది రష్మిక. బాలీవుడ్ ఎలాంటిదో తాను ప్రయోగం చేసి తెలుసుకుంటానని అన్నది. 

ఏవి ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకునే ఉత్సుకత ఎక్కువగా ఉన్న అమ్మాయిని తాను అని చెబుతుంది రష్మిక. అయితే బాలీవుడ్ తో తాను ప్రయోగాలు చేస్తానని రష్మిక అనడం మాత్రం సంచలనంగా మారింది.

సింగిల్ లైఫే బెస్ట్..

తొలి సినిమాతోనే లవ్ లో పడి, ఆ తర్వాత వెంటనే ఎంగేజ్ మెంట్ చేసుకుని, అంతే త్వరగా ప్రేమకు గుడ్ బై చెప్పేసింది రష్మిక. ఆ తర్వాత ఆమెను చాలామంది హీరోలకు లింక్ చేస్తూ వార్తలొచ్చాయి కానీ రష్మిక మళ్లీ ప్రేమలో పడలేదు. సింగిల్ లైఫ్ ని తాను బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పే రష్మిక, సింగిల్ గా ఉంటే అనేక లాభాలున్నాయని అంటుంది.

ఒంటరితనాన్ని అనుభవిస్తూ, ఆనందిస్తూనే.. మరింత ఉన్నతంగా ఎదగాలని చెబుతోంది. మొత్తమ్మీద రష్మికను ఇంటర్వ్యూ అడగాలే కానీ.. కావాల్సినంత కాంట్రవర్సీ మెటీరియల్ రెడీగా ఉంచుకుంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ సెన్సేషనల్ స్టేట్ మెంట్లే ఇస్తుంది.