సమంత ట్రెండ్ ఫాలో అవ్వలేదు, సెట్ చేసింది

పెళ్లైతే హీరోయిన్ కెరీర్ క్లోజ్ అయినట్టే. తల్లి-వదిన పాత్రలు చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిందంటోంది ప్రియమణి. మరీ ముఖ్యంగా సమంత ఆ ట్రెండ్ ను పీక్స్ కు తీసుకెళ్లిందని చెబుతోంది. పెళ్లయినప్పటికీ సమంతకు…

పెళ్లైతే హీరోయిన్ కెరీర్ క్లోజ్ అయినట్టే. తల్లి-వదిన పాత్రలు చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిందంటోంది ప్రియమణి. మరీ ముఖ్యంగా సమంత ఆ ట్రెండ్ ను పీక్స్ కు తీసుకెళ్లిందని చెబుతోంది. పెళ్లయినప్పటికీ సమంతకు ఫుల్ డిమాండ్ ఉందని, ఆమె చేస్తున్న వర్క్ ను మెచ్చుకుంటోంది ప్రియమణి.

“ఒకప్పట్లా పెళ్లయిందని హీరోయిన్లను పక్కన పెట్టడం లేదు. ఒకప్పుడు హీరోయిన్ కు నిశ్చితార్థం అయిందని తెలిస్తేనే అవకాశాలు తగ్గిపోయేవి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మైండ్ సెట్ మారింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సమంత. పెళ్లయిన తర్వాత కూడా సమంత తన క్రేజ్ కొనసాగిస్తోంది. ఆమె చేస్తున్న సినిమాలు, ఆమె ఫిజిక్ మెయింటెనెన్స్ సూపర్. ఇప్పటికీ చాలామంది మేకర్స్ సమంతతో వర్క్ చేసేందుకు ఎదురుచూస్తున్నారు.”

ఇలా సమంతను ఆకాశానికెత్తేసింది ప్రియమణి. ఇక పెళ్లి తర్వాత తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. తనకు కూడా మ్యారేజ్ తర్వాత అవకాశాలు  బాగానే వస్తున్నాయని చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి, ఓటీటీల నుంచి ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయని అంటోంది.

ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతున్న నెపొటిజంపై కూడా తనదైన స్టయిల్ లో స్పందించింది ప్రియమణి. స్టార్ కిడ్స్ కు అవకాశాలు తొందరగా వస్తాయని, అందులో నిజం ఉందని ఆమె ఒప్పుకుంది. అయితే తమ తండ్రి, తాతల వారసత్వాన్ని, వాళ్ల స్టార్ డమ్ ను కొనసాగించేందుకు నెపోకిడ్స్ కు డబుల్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందని అంటోంది. వీళ్లకు అవకాశం ఎంత ఈజీగా వస్తుందో, ఆ అంచనాల్ని నిలబెట్టుకోవడానికి వాళ్లు అంతలా రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని చెబుతోంది. 

నెపొటిజం అనేది ఒక విధంగా వరం, మరో విధంగా శాపం అంటోంది ప్రియమణి. ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం, నారప్ప సినిమాల్లో నటిస్తోంది ఈమె.

10 ప్యాక్ తో వస్తున్నా

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం