పవన్ కల్యాణ్ టైటిల్ తో నితిన్

ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, స్టయిల్ మాత్రమే ఫాలో అయ్యాడు. కొన్ని సినిమాల్లో అతడి స్టెప్పులు కూడా కాపీ కొట్టాడు. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ పాత సినిమా టైటిల్ వాడేస్తున్నాడు నితిన్. అవును..…

ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, స్టయిల్ మాత్రమే ఫాలో అయ్యాడు. కొన్ని సినిమాల్లో అతడి స్టెప్పులు కూడా కాపీ కొట్టాడు. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ పాత సినిమా టైటిల్ వాడేస్తున్నాడు నితిన్. అవును.. నితిన్ కొత్త సినిమాకు తమ్ముడు అనే టైటిల్ పెట్టారు.

పవన్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి 'తమ్ముడు'. ఇప్పుడిదే టైటిల్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ మూవీ లాంఛ్ అయింది. 1వ తేదీ నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్తారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తాడు.

వకీల్ సాబ్ సినిమా తర్వాత, అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమాను పట్టాలపైకి తీసుకురావాలని ప్రయత్నించాడు వేణు శ్రీరామ్. కానీ అది ప్రాక్టికల్ గా సాధ్యం కాలేదు. ఈ గ్యాప్ లోనే పవన్ తో మరో సినిమా అంటూ ప్రచారం జరిగినా అది నిజం కాలేదు.

ఇప్పుడిలా నితిన్ తో కలిసి 'తమ్ముడు' ప్రాజెక్టుతో సెట్స్ పైకి వచ్చాడు వేణు. బన్నీతో చేయాల్సిన ఐకాన్ కు, ఈ తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదంటున్నాడు ఈ దర్శకుడు.

ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ ట్రా సినిమా చేస్తున్నాడు నితిన్. దీంతో పాటు, చేతిలో వెంకీ కుడుముల సినిమా కూడా ఉంది. ఇప్పుడు వేణు శ్రీరామ్ మూవీని కూడా పట్టాలపైకి తీసుకొస్తున్నాడు.