ధమాకా షూటింగ్ లో దొంగలు పడ్డారు

షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లే సినిమా యూనిట్లు తమ విలువైన వస్తువులు, బ్యాగులు పోగొట్టుకుంటుంటారు. మొన్నటికిమొన్న ఓ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన కీర్తిసురేష్, తన కాస్ట్యూమ్స్ బ్యాగ్ పోగొట్టుకుంది. ఇప్పుడు సరిగ్గా…

షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లే సినిమా యూనిట్లు తమ విలువైన వస్తువులు, బ్యాగులు పోగొట్టుకుంటుంటారు. మొన్నటికిమొన్న ఓ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన కీర్తిసురేష్, తన కాస్ట్యూమ్స్ బ్యాగ్ పోగొట్టుకుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి అనుభవమే హీరోయిన్ శ్రీలీలకు కూడా ఎదురైంది.

ధమాకా టైమ్ లో షూటింగ్ కు అత్యంత కీలకమైన కాస్ట్యూమ్స్ బ్యాగ్ దొంగతనానికి గురైందని, ఆ టైమ్ లో కాస్త టెన్షన్ పడినప్పటికీ.. ఇప్పుడు తలుచుకుంటే అదొక స్వీట్ మెమొరీలా అనిపిస్తోందని చెబుతోంది.

“ధమాకా లోని జింతాక్ పాటను స్పెయిన్ లో షూట్ చేశాం. రేపు షూటింగ్ అనగా నా కాస్ట్యుమ్ బ్యాగ్ పోయింది. చాలా టెన్షన్ పడ్డాను. అయితే మేం ఉండే లొకేషన్ నుండి 3 గంటలు ప్రయాణించి మా డీవోపీ, డైరెక్టర్ వేరేవేరే ప్రదేశాలకు వెళ్లి అక్కడ నా కోసం షాపింగ్ చేసి, అక్కడ్నుంచి ఫోటోలు పెట్టి ఓకే చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం షాపింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అదొక మంచి క్యూట్ మూమెంట్.”

ఇలా ధమాకా షూటింగ్ టైమ్ లో తనకు ఎదురైన వింత అనుభవాన్ని చెప్పుకొచ్చింది శ్రీలీల. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా.

ఓవైపు బిజీగా సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు మెడిసిన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. షూటింగ్ పూర్తయిన వెంటనే ఇంటికెళ్లి, మెడికల్ పుస్తకాలతో కుస్తీ పడతానని, ఎలాగైనా మెడిసిన్ పూర్తి చేస్తానని నమ్మకంగా చెబుతోంది.