ప‌వ‌న్ తో.. చంద్ర‌బాబు ఇంకో రాంగ్ స్ట్రాట‌జీ?

జ‌న‌సేన అనే పార్టీ పెట్ట‌క ముందే చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ట‌చ్లో ఉన్నాడ‌నేది మొద‌ట్లోనే వినిపించిన మాట‌. అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్, నాగ‌బాబులు వెళ్లి చంద్ర‌బాబుతో స‌మావేశం అయ్యార‌ని ముందుగా పుకార్లు వ‌చ్చాయి.  Advertisement…

జ‌న‌సేన అనే పార్టీ పెట్ట‌క ముందే చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ట‌చ్లో ఉన్నాడ‌నేది మొద‌ట్లోనే వినిపించిన మాట‌. అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్, నాగ‌బాబులు వెళ్లి చంద్ర‌బాబుతో స‌మావేశం అయ్యార‌ని ముందుగా పుకార్లు వ‌చ్చాయి. 

ఆ త‌ర్వాత నిజంగానే ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేయ‌డం, చంద్ర‌బాబుతో జ‌త క‌ట్ట‌డం, అప్ప‌టి నుంచి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌యోజ‌నాల మేర‌కు ప‌ని చేసి పెడుతూ ఉండ‌టం జ‌రిగింది, జ‌రుగుతోంది. 

ప‌వ‌న్ ఏం చేసినా అది చంద్ర‌బాబు గైడెన్స్ లోనే అనేది సూఛాయ‌గా స్ప‌ష్టం అవుతున్న విష‌యం. త‌న రాజ‌కీయం విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏదీ ఆలోచించేదేమీ ఉండ‌దు, చంద్ర‌బాబే ప‌వ‌న్ కు దిశానిర్దేశం చేస్తున్నార‌నేది బ‌హిరంగ స‌త్యంగా మారిపోయింది. 

చంద్ర‌బాబు అధికారంలో ఉన్నా లేక‌పోయినా ఈ బంధం అయితే కొన‌సాగుతున్న దాఖ‌లాలు క‌నిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ పొలిటిక‌ల్ డ్రామాలో త‌రువాయి అంకం, తెలుగుదేశం- జ‌న‌సేన‌లు పొత్తుతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డ‌మే.

ఇది ఇప్పటికిప్పుడు అల్లుకున్న వ్యూహం ఏమీ కాక‌పోవ‌చ్చు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌ను ఓట్ల‌ను చీల్చే పార్టీగా పోటీ చేయించిన చంద్ర‌బాబు నాయుడు, వ‌చ్చేసారి ఓట్ల‌ను క‌లుపుకుని వ‌చ్చే పార్టీగా ప్ర‌యోగించ‌బోతున్నారు. 

క్రితం సారి చంద్ర‌బాబు వ్యూహం తేడా కొట్టింది. ప‌వ‌న్ ప‌రువు కూడా పోయింది. ఇక వ‌చ్చేసారి ఈ వ్యూహం ఏ మేర‌కు స‌ఫ‌లం అవుతుందో కానీ, ఇప్పుడు బీజేపీని తెంపుకురావ‌డం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అంత తేలికా? అనేది అస‌లైన ప్ర‌శ్న‌.

వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ బాహాటంగా బీజేపీతో దోస్తీకి పిలుపును ఇవ్వ‌డం వెనుక ఉన్న‌ది కూడా చంద్ర‌బాబు వ్యూహమే అనేది స‌ర్వ‌త్రా ఉన్న అభిప్రాయ‌మే. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ తో చేతులు క‌లిపడంతో చంద్ర‌బాబును బీజేపీ అస‌హ్యించుకుంటూ ఉంది. 

అన్నింటికి మించి చంద్ర‌బాబును ఒక న‌మ్మ‌క‌ద్రోహిగా చూస్తోంది. త‌న‌ను డైరెక్టుగా బీజేపీ వాళ్లు రానివ్వ‌ర‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను బీజేపీకి దోస్తీగా మార్చారు చంద్ర‌బాబు. అయితే ఈ దోస్తీ రెండేళ్ల‌ను పూర్తి చేసుకుంటున్నా అక్క‌డ ప‌వ‌న్ క‌ల్యాణ్ సాధించిన ప్ర‌గ‌తి చెప్పుకోద‌గిన రీతిలో లేదు!

బ‌హుశా బీజేపీ హైక‌మాండ్ కు కూడా ఈ విష‌యాల‌పై క్లారిటీ ఉందేమో. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ లేట్ చేసేందుకు లేదు, వీలైనంత త్వ‌ర‌గా తెలుగుదేశం, జ‌న‌సేన‌లు క‌లిసి సాగాల్సి ఉంది. 

బీజేపీనేమో.. వీరి దారికి వ‌చ్చేలా లేదు. బీజేపీ వ‌చ్చినా రాకున్నా, ప‌వ‌న్ వెళ్లిపోయి చంద్ర‌బాబుతో బ‌హిరంగంగా చేతులు క‌ల‌ప‌డ‌మే మిగిలిందిక‌. మ‌రి ఇన్నాళ్లూ త‌మ ప‌క్క‌న కూర్చున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు ఉన్న‌ట్టుండి తెగ‌దెంపులు చేసుకుని వెళ్లి చంద్ర‌బాబు ప‌క్క‌న కూర్చుంటే అప్పుడు ఢిల్లీలోని క‌మ‌లం పెద్ద‌లు ఊరికే చూస్తూ ఉంటారా? అనేది శేష‌ప్ర‌శ్న‌. 

ఏదో ఒక సాకు చెప్పేసి ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీతో బంధం ముగిసిన‌ట్టుగా ప్ర‌క‌టించేసి, చంద్ర‌బాబుతో బ‌హిరంగ స్నేహాన్ని మొద‌లుపెట్ట‌వ‌చ్చు. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పెద్ద ఇబ్బంది లేక‌పోవ‌చ్చు. అయితే.. చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు త‌మ‌తో ఆట ఆడుతున్నార‌ని, మ‌రోసారి బీజేపీ అధిష్టానానికి అనిపిస్తే? 2014-19 ల మ‌ధ్య‌న ఇలాంటి ఆటే ఆడారు. 

రెండోసారి చంద్ర‌బాబును బీజేపీ రానివ్వ‌లేదు, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ద‌గ్గ‌ర‌కు చేరాడు. ఇప్పుడు మ‌ళ్లీ దూరం అయితే అది కూడా చంద్ర‌బాబు ఆట‌లో భాగంగా బీజేపీ మ‌రోసారి బ‌కారా అయితే..? అప్పుడు ఆ పార్టీ రియాక్ష‌నేమిట‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం.

ఏదేమైనా ప‌వ‌న్ ను అడ్డం పెట్టుకుని మ‌రోసారి త‌మ‌తో కామెడీ చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోక‌పోవ‌చ్చు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబ‌ట్టి..చంద్ర‌బాబుకు ఏవైనా న‌ట్ల‌ను టైట్ చేసినా చేయొచ్చు!