చంద్ర‌బాబుకు తాత స‌బ్బంహ‌రి.. బ్యాచ్ బ్యాచ్చే తేడానా?

జరిగింది త‌న వ‌ల్లే, జ‌ర‌గ‌బోయేది త‌న వ‌ల్లే.. అంటూ ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన స‌క‌ల ఘ‌న‌కార్యాలూ త‌న వ‌ల్ల‌నే అంటూ చంద్ర‌బాబు నాయుడు చెప్పుకుంటున్నారు. జూమ్ వీడియోలు పెట్టి.. చంద్ర‌బాబు నాయుడు డ‌ప్పేసుకుంటున్నారు.…

జరిగింది త‌న వ‌ల్లే, జ‌ర‌గ‌బోయేది త‌న వ‌ల్లే.. అంటూ ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన స‌క‌ల ఘ‌న‌కార్యాలూ త‌న వ‌ల్ల‌నే అంటూ చంద్ర‌బాబు నాయుడు చెప్పుకుంటున్నారు. జూమ్ వీడియోలు పెట్టి.. చంద్ర‌బాబు నాయుడు డ‌ప్పేసుకుంటున్నారు. వాటిని ఎవ‌రైనా వింటున్నారో లేదో కానీ.. బ‌హుశా ఎవ‌రూ విన‌డం లేద‌నే ధైర్యం చంద్ర‌బాబుది కావొచ్చు.

అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీలో పూర్తి కాని ప్రాజెక్టుల‌ను కూడా త‌నే పూర్తి చేసేసిన‌ట్టుగా వాటిల్లో చెప్పుకుంటున్నార‌ట చంద్ర‌బాబు నాయుడు. ఎలాగూ హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔట‌ర్ రింగ్ రోడ్డు అనే పాత రికార్డు ప్లే చేస్తూనే ఉంటారు. అదంతా త‌న తుత్తిగా చంద్ర‌బాబు నాయుడు చెప్పుకుంటు ఉండ‌ని సంద‌ర్భం బ‌హుశా ఉండ‌దు!

మ‌రి చంద్ర‌బాబు నాయుడే అనుకుంటే.. ఆయ‌న‌కు తాత‌లా మాట్లాడాడు మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి. రాజ‌కీయంగా ఈయ‌న ప‌లుకుబ‌డి ఏ స్థాయిలో ఉందో ఎవ‌రికీ తెలియ‌దు కానీ.. తాజాగా కొత్త విష‌యాన్ని సెల‌విచ్చారు. ఏబీఎన్ వెంక‌ట‌కృష్ణ ఎంతో ఉత్సాహంతో ఊ కొడుతూ ఉండ‌గా.. విశాఖ‌కు ఘాజీ తెచ్చి పెట్టింది త‌నే అని స‌బ్బం హ‌రి చెప్పుకున్నారు.

ఇంత‌కీ ఘాజీ అంటే.. ఆ మ‌ధ్య సినిమా వ‌చ్చిందిగా, బ‌హుశా అదేదో ఇండియాకు సంబంధించింద‌ని స‌బ్బం హ‌రి అనుకున్నట్టున్నారు. అది పాకిస్తాన్ స‌బ్ మెరైన్ అని ఈయ‌న‌కు తెలియ‌క‌పోవ‌చ్చు. అందుకే.. దాని మీద సినిమా తీశారు కాబట్టి.. అదేదో గొప్ప‌దే అయ్యుంటుంద‌ని అనుకుని.. దాన్ని త‌నే తెచ్చిపెట్టిన‌ట్టుగా స‌బ్బం హ‌రి చెప్పుకున్నారు!

అంత‌గా ఘాజీ ఇండియాదే అని ఈ మేధావి అనుకున్నా.. అప్ప‌టికీ ఈయ‌న ఎవ‌రు? అప్ప‌టికి ఎంపీ కాదు, లేక మేయ‌ర్ కాదు.. ఘాజీ క‌థే ఈనాటిది కాదు! వాటితో ప‌నేముంది? అవ‌త‌ల చంద్ర‌బాబు నాయుడు చెప్పుకుంటున్నారు క‌దా.. ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా, వాటి మ‌ధ్య‌లో త‌నూ చెప్పేసుకుంటే వినే తెలుగు జ‌నాలు ఉన్నారు క‌దా, వారి ఖ‌ర్మ.. అన్న‌ట్టుగా స‌బ్బం హ‌రి రెచ్చిపోయిన‌ట్టుగా ఉన్నారు. ఘాజీని తెచ్చిపెట్టింది త‌నే స‌బ్బం హ‌రి చెప్పుకుంటే.. ఎంతో ఉత్సాహంతో ఊ కొట్టాడు వెంక‌ట‌కృష్ణ‌! మొత్తానికి చంద్ర‌బాబు నాయుడే అనుకుంటే.. వీళ్ల బ్యాచ్ బ్యాచ్చే ఇలా స్వైర్య‌విహారం చేస్తున్న‌ట్టుగా ఉంది!

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం