సీడెడ్ లో ఆసియన్-దిల్ రాజు ఆఫీసు!

టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూషన్ పోరు ముదురుతున్నట్లు కనిపిస్తోంది. నైజాంలో మైత్రీ సంస్థతో కలిసి సీడెడ్ కు చెందిన శశి పంపిణీ ఆఫీసును కొత్తగా ప్రారంభించారు. వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలను పంపిణీ చేస్తున్నారు.  Advertisement…

టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూషన్ పోరు ముదురుతున్నట్లు కనిపిస్తోంది. నైజాంలో మైత్రీ సంస్థతో కలిసి సీడెడ్ కు చెందిన శశి పంపిణీ ఆఫీసును కొత్తగా ప్రారంభించారు. వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలను పంపిణీ చేస్తున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో నైజాంలో, ఆంధ్రలో పంపిణీ వ్యాపారం చేస్తున్న కొందరు కలిసి సీడెడ్ లో పంపిణీ ఆఫీసు ప్రారంభించాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మేరకు ఈ రోజు ఉదయం తొలి సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. పలువురు పంపిణీ రంగ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొనట్లు తెలుస్తోంది.

దిల్ రాజు/శిరీష్, ఆసియన్ సునీల్ తో పాటు మరి కొందమంది భాగస్వాములుగా కలిసి, సిండికేట్ గా ఫార్మ్ అయి, సీడెడ్ లో ఆఫీసు ప్రారంభించాలన్న దాని మీద ఈ సమావేశంలో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సీడెడ్ బిజినెస్ వైపు వేరే వాళ్లు తొంగి చూడలేదు. ఆంధ్ర, నైజాం సినిమా బిజినెస్ వేరు. సీడెడ్ బిజినెస్ వేరు అన్నది టాలీవుడ్ లో వినిపించే మాట. ఆంధ్రలో, నైజాంలో అంకెలు తెలిసినట్లు సీడెడ్ లో తెలియవు. ఎందుకంటే అక్కడ జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా అమ్మకాలు, థర్డ్ పార్టీ సేల్స్ ఎక్కువ వుంటాయి.

మరి ఇలాంటి చోట ఆసియన్ సునీల్, దిల్ రాజు/శిరీష్ లాంటి వాళ్లు ఎంటరై, సరైన పోటీ ఇవ్వగలరా? సరైన బిజినెస్ చేయగలరా అన్నది చూడాల్సి వుంది. దిల్ రాజుతో సంబంధాలు వున్న యువి సంస్థకు ఇప్పటికే సీడెడ్ ఏరియాలోని కర్నూలు, నెల్లూరు ప్రాంతాల్లో థియేటర్లు వున్నాయి. పంపిణీ వ్యాపారం కూడా వుంది. మరి వాళ్లు కూడా కలిసి వస్తారేమో తెలియాల్సి వుంది.

అసలు ఇదంతా జరుగుతుందా? కేవలం నైజాంలో మైత్రీ ఆఫీసు పెట్టిన పర్యవసానాలు కంట్రోలు చేయడానికి ఇదంతా చేస్తున్నారా అన్నది కూడా తెలియాల్సి వుంది. అయితే ఇలాంటి ఆలోచన లేదని దిల్ రాజు తెలిపారు.