వాల్తేర్ వీరయ్య..మెగాస్టార్ తో మైత్రీ నిర్మిస్తున్న డైరక్టర్ బాబీ సినిమా. ఈ సినిమా ప్యూర్ మల్టీస్టారర్ నా? లేదా సినిమాలో రెండో హీరో రవితేజ జస్ట్ మోర్ దాన్ గెస్ట్ క్యారెక్టర్ నా అన్న అనుమానాలు వున్నాయి.
ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. సినిమాలో రవితేజ 42 నుంచి 44 నిమిషాలు స్క్రీన్ మీద కనిపిస్తాడు. అది కూడా మేజర్ సీన్లు అన్నీ మెగాస్టార్ కాంబినేషన్ లోనే వుంటాయి. ఇద్దరి కాంబినేషన్ లో ‘పూనకాలు లోడింగ్’ అనే సాంగ్ కూడా వుంది. త్వరలో దీన్ని విడుదల చేయబోతున్నారు. అందువల్ల వాల్తేర్ వీరయ్య పక్కా మల్టీస్టారర్ అనే అనుకోవాలి.
ఇదిలా వుంటే వాల్తేర్ వీరయ్య ఫైనల్ కట్ వర్క్ జరిగిపోయింది. రెండు గంటల 35 నిమషాల పెర్ ఫెక్ట్ నిడివి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మ్యూజిక్ డైరక్టర్ దేవీ తన పని మొదలుపెట్టేసారు.
వాల్తేర్ వీరయ్యకు పోటీగా వస్తున్న వీరసింహారెడ్డి లో హీరో బాలకృష్ణ నే డబుల్ రోల్ చేస్తున్నారు. దీని ఫైనల్ కట్ ఎంత వచ్చింది అన్నది తెలియాల్సి వుంది. యాక్షన్ సీన్లు ఎక్కువ వుండడంతో నిడివి కాస్త ఎక్కువే వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా ఓ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది.
ఈ రెండు సినిమాలతో పాటు వస్తున్న విజయ్ వారసుడు కూడా ఫైనల్ కట్ తేలాల్సి వుంది.