జలవిహార్‌లో ఆదివారం జరిగిన అయ్‌బలయ్‌లో రెండు దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇందులో ఒక దృశ్యం కొందరు సినిమా వాళ్ల సంకుచిత్వాన్ని బట్టబయలు చేసింది., మరొకటి రాజకీయ నేతల విజ్ఞతను కళ్లకు కట్టింది.
రాజకీయ పరంగా నిత్యం పరస్పరం తిట్టుకునే పార్టీలకు చెందిన ముఖ్య నేతలు మాటీమంతీ కలిపితే, జనానికి నీతులు బోధించే ఇద్దరు సినీ ప్రముఖులు మాత్రం కనీసం ఒకరి ముఖాలు మరొకరు చూడడానికి కూడా ఇష్టపడని సంకుచిత వైఖరి బయట పెట్టుకున్నారు.
గవర్నర్ దత్తాత్రేయ నేతృత్వంలో జరిగిన అలయ్‌బలయ్ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ, ప్రజాసంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. ఇటీవల ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, జనసేనాని పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు.
ఒకే వేదికపై ఈ ఇద్దరు సినీ ప్రముఖులు పరస్పరం పలకరించుకోడానికి కూడా ఇష్టపడలేదు. పక్కపక్కనే కూచున్నా ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. మౌనం రాజ్యమేలింది. ఒక దశలో పవన్‌తో మాట్లాడేందుకు విష్ణు ప్రయత్నించినా, ఆయన నుంచి కనీస సానుకూలత కూడా వ్యక్తం కావడం గమనార్హం.
ఇదే వేదికపై రాజకీయంగా బద్దశత్రువులైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.కవిత పక్కపక్కనే ఆసీనులయ్యారు. ఇద్దరు నేతలు హాయిగా మాట్లాడుకుంటూ కనిపించారు.
రాజకీయంగా కత్తులు దూసుకునే వేర్వేరు పార్టీలకు చెందిన ఈ ఇద్దరు నేతలు …అవేవీ పట్టించుకోకుండా స్నేహపూర్వకంగా మెలగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఢీ అంటే ఢీ అని తలపడుతున్న సందర్భంలో ఇద్దరు నేతలు నవ్వుతూ మాట్లాడుకోవడం ఆకర్షించింది.
ఈ రెండు దృశ్యాలను నెటిజన్లు పోలుస్తూ… మంచు విష్ణు, పవన్‌లపై ట్రోల్ చేస్తున్నారు. సినిమాల్లో నీతులు చెబుతా, తాము మాత్రం కనీస సంస్కారాన్ని ప్రదర్శించక పోవడం దేనికి సంకేతమని కామెంట్స్ పెట్టారు. అలాగే రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రవులు ఉండరనే సంకేతాన్ని బండి సంజయ్, కె.కవిత తమ చర్యల ద్వారా పంపారని, కనీసం వాళ్లను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు చెబుతూ నెటిజన్లు చెలరేగడం గమనార్హం.