ప్రతిజ్ఞతో ప్రాణాన్ని నిలబెడదాం!

ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పలు సేవాకార్యక్రమలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు…

ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పలు సేవాకార్యక్రమలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం నుండి వైయస్ఆర్ సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ జననేత జగన్ గారిపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని పేర్కొన్నారు.

రక్తదానంకు సంబంధించి ప్రత్యేక వెబ్ సైట్ (www.ysrcpblooddonation.com)ను సజ్జల ప్రారంభించారు. 2020లో వైయస్ఆర్ సీపీ, రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రికార్డుస్ధాయిలో 38 వేల యూనిట్లు రక్తదానం చేయడం జరిగింది. ఈ ఏడాది ఫిజికల్‌గా రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు వెబ్ సైట్ ను కూడా వైయస్ఆర్ సీపీ ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశాలలోను రక్తం అవసరం ఉన్నవారికి ఈ వెబ్ సైట్ (www.ysrcpblooddonation.com) ద్వారా రక్తాన్ని అందించనున్నారు. TAKE THE PLEDGE SAVE A LIFE అనే నినాదంతో భవిష్యత్తులో అత్యవసర పరిస్దితులలో రక్తదానం చెయ్యడానికి అంగీకారం తెలుపుతూ www.ysrcpblooddonation.com వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా కార్యకర్తలు, పార్టీ శ్రేణులను వైయస్ఆర్ సీపీ ప్రోత్సహిస్తోంది.

ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగేలా వివిధ కాలేజీలు, సంస్ధల్లో ఈ వెబ్ సైట్ ను వైయస్ఆర్ సీపీ ప్రమోట్ చేయనుంది. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ అమెరికా కన్వీనర్, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. రక్తదానానికి ప్రతిజ్ఞ చేయడంతో అటు సీఎం జగన్ గారి పై అభిమానాన్ని చాటుకోవడంతో పాటు భవిష్యత్ లో ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందించి సామాజిక బాధ్యతనూ నెరవేర్చినట్టు అవుతుందని తెలిపారు.

జగన్ గారి పుట్టిన రోజున రక్తదానం చేయడంతో పాటుగా వెబ్ సైట్ లో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకుని భవిష్యత్ లో కూడా రక్తదానం చేసేలా ప్రతిజ్ఞ చేద్దామని, తద్వారా ప్రతిజ్ఞతో ప్రాణాన్ని నిలబెట్టినవారమవుదామని పిలుపునిచ్చారు.