ప్రపంచంలోనే తొలి సూపర్ మోడల్ రోబో కేఫ్ ఇది

ఎంజాయ్ చేయాలంటే ప్రస్తుతం దుబాయ్ కు మించిన డెస్టినేషన్ లేదు. సెలబ్రిటీల నుంచి సాధారణ పర్యాటకుల వరకు చాలామంది ఇప్పుడు దుబాయ్ వెళ్లడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తననుతాను మార్చుకుంటోంది…

ఎంజాయ్ చేయాలంటే ప్రస్తుతం దుబాయ్ కు మించిన డెస్టినేషన్ లేదు. సెలబ్రిటీల నుంచి సాధారణ పర్యాటకుల వరకు చాలామంది ఇప్పుడు దుబాయ్ వెళ్లడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తననుతాను మార్చుకుంటోంది ఈ మహానగరం. ఇందులో భాగంగా దుబాయ్ కు ఇప్పడు మరో ఎట్రాక్షన్ యాడ్ కాబోతోంది.

ప్రపంచంలోనే తొలి సూపర్ మోడల్ రోబో కేఫ్ కు వేదికగా మారనుంది దుబాయ్. డోనా సైబర్ కేఫ్ పేరిట దుబాయ్ లో ఓ రెస్టారెంట్ ఓపెన్ అవుతోంది. వచ్చే ఏడాది దీన్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఉద్యోగులు, వెయిటర్లు ఉండరు. పూర్తిగా రోబోలతో నడిచే రెస్టారెంట్ ఇది. ప్రపంచంలో ఈ తరహా రెస్టారెంట్ ఇదొక్కటే.

హోటల్ లోకి అహ్వానించే దగ్గర్నుంచి, వంటలు వండటం, వడ్డించడం, బిల్లు అందివ్వడం, మంచి నీళ్లు ఇవ్వడం.. ఇలా సమస్తం రోబోలతోనే నడుస్తుంది ఈ హోటల్ లో. మనుషుల అవసరం లేదు కాబట్టి, ఈ కేఫ్ రోజులో 24 గంటలు పనిచేస్తుంది.

ఇందులో రోబోలన్నీ సూపర్ మోడల్స్ తరహాలో ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆర్డీఐ రోబోటిక్స్ సంస్థ తయారుచేసిన ఈ రోబోల్ని రోబో-సీ2గా వ్యవహరిస్తారు. వీటి చర్మం, అచ్చం మనిషి చర్మాన్ని పోలి ఉంటుంది. అత్యాధునిక సిలికాన్ స్కిన్ ను వీటికి అమర్చారు.

ఈ సూపర్ మోడల్ రోబోలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. హోటల్ కు వచ్చే కస్టమర్ల హావభావాల్ని ఇవి క్యాచ్ చేస్తాయి. వాళ్లు ఏదైనా జోక్స్ వేసుకుంటే, ఈ రోబోలు కూడా నవ్వడం లేదా మరో జోక్ చెప్పడం లాంటివి చేస్తాయి. వచ్చే ఏడాది నుంచి ఈ రెస్టారెంట్ అందుబాటులోకి వస్తుంది.