ఆన్ లైన్ బుకింగ్ లో ఆల్ టైమ్ రికార్డ్

ఈ ఏడాది ఆన్ లైన్ టికెట్స్ బుకింగ్స్ లో కేజీఎఫ్-2 సత్తా చాటింది. అన్ని సినిమాలపై తన పూర్తి ఆధిపత్యాన్ని చాటింది. బుక్ మై షో విడుదల చేసిన ఇయర్ ఎండ్ రిపోర్ట్ లో…

ఈ ఏడాది ఆన్ లైన్ టికెట్స్ బుకింగ్స్ లో కేజీఎఫ్-2 సత్తా చాటింది. అన్ని సినిమాలపై తన పూర్తి ఆధిపత్యాన్ని చాటింది. బుక్ మై షో విడుదల చేసిన ఇయర్ ఎండ్ రిపోర్ట్ లో అగ్రస్థానంలో నిలిచింది కేజీఎఫ్ 2 మూవీ.

బుక్ మై షో యాప్ ద్వారా ఈ ఏడాది అత్యథికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా కేజీఎఫ్ 2 నిలిచింది. ఈ యాప్ ద్వారా అన్ని భాషల్లో కలుపుకొని కేజీఎఫ్2 సినిమాకు సంబంధించి 17.7 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమా రిలీజైన ఏప్రిల్ 14న ఒక్క రోజులోనే 2.14 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి.

ఈ ఏడాది ఈ యాప్ ద్వారా కేజీఎఫ్2 సినిమాకు మాత్రమే అత్యథికంగా టికెట్లు తెగాయి. ఆర్ఆర్ఆర్, కాంతార, విక్రమ్ లాంటి సినిమాలన్నీ కేజీఎఫ్2 తర్వాతే నిలిచాయి. అయితే ఓవర్సీస్ లో మాత్రం కేజీఎఫ్2పై ఆర్ఆర్ఆర్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది.

బుక్ మై షోలో ఇప్పటివరకు బాహుబలి-2 సినిమాదే అగ్రస్థానం. ఆ మూవీకి మాత్రం అత్యథికంగా ఆన్ లైన్ టికెట్లు బుక్కయ్యాయి. ఇప్పుడా రికార్డ్ ను కేజీఎఫ్2 బీట్ చేసింది. బాహుబలి-2 కంటే 34శాతం అధికంగా కేజీఎఫ్-2కు ఆన్ లైన్లో టికెట్లు తెగాయి.