ఆదిపై ‘ఆదిత్య’కు అంత నమ్మకం ఏంటి?

ఆది సాయికుమార్.. చాలా సినిమాలు చేసినప్పటికీ, ఇంకా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోయాడు. స్టార్ డమ్ అందుకోలేకపోయాడు. అయినప్పటికీ ఇతడితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. వాళ్ల లెక్కలు వాళ్లకున్నాయి. అయితే ఆదిత్య మ్యూజిక్…

ఆది సాయికుమార్.. చాలా సినిమాలు చేసినప్పటికీ, ఇంకా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోయాడు. స్టార్ డమ్ అందుకోలేకపోయాడు. అయినప్పటికీ ఇతడితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. వాళ్ల లెక్కలు వాళ్లకున్నాయి. అయితే ఆదిత్య మ్యూజిక్ లాంటి బడా సంస్థ, ఆది సాయికుమార్ పై పెట్టుబడులు పెట్టడమే కాస్త ఆశ్చర్యం కలిగించే అంశం.

ఆది సాయికుమార్ లేటెస్ట్ మూవీ క్రేజీ ఫెలో. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ను 'ఆదిత్య' సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమాతో నాన్-థియేట్రికల్ బిజినెస్ ఏ స్థాయిలో చేసిందో ఆ కంపెనీకే తెలియాలి. ఇదేదో కాకతాళీయంగా జరిగిందనడానికి వీల్లేదు.

ఇదే ఆదిత్య సంస్థ, ఆది సాయికుమార్ తదుపరి చిత్రం టాప్ గేర్ నాన్-థియేట్రికల్ రైట్స్ ను కూడా దక్కించుకుంది. చూస్తుంటే… ఆది సాయికుమార్ కు నాన్-థియేట్రికల్ బిజినెస్ బాగానే ఉన్నట్టుంది. లేదంటే, ఆదిత్య సంస్థకైనా నాన్-థియేట్రికల్ మార్కెట్ పై పట్టయినా ఉండి ఉండాలి. ఎందుకంటే, గట్టి లాబీయింగ్ తో శాటిలైట్, ఓటీటీ రైట్స్ అమ్ముకోగలిగితే, ఏ సినిమా రైట్స్ అయినా తీసుకోవచ్చు మరి.

ఆదిత్య మ్యూజిక్ తరహాలోనే చాలా కంపెనీలు, తెలుగు సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. నిర్మాణంలో భాగస్వామ్యం కాకుండా.. హక్కులు రాయించుకొని, ప్రొడ్యూసర్లకు ఫండింగ్ ఇస్తున్నాయి. బీ4యు, టీ-సిరీస్ లాంటి కంపెనీలు టాలీవుడ్ లో చేస్తున్న పని ఇదే. కాకపోతే ఆదిత్య సంస్థ ఈ విషయంలో కాస్త ఎగ్రెసివ్ గా ఉంది.