దేశం అభివృద్ధి సాధించింది అన్నది ఏ విధంగా కొలుస్తారు. దానికి కొలమానం ఏమిటి అంటే ఎవరి ఆలోచనల మేరకు వారు చెబుతారు. దేశం వెలిగిపోతోంది అని రాజకీయ నాయకులు తమ పార్టీ గురించి ప్రచారం చేసుకోవచ్చు. కానీ మేధావులు ఆర్ధిక నిపుణుల అంచనాలు వేరే విధంగా ఉంటాయి.
దేశం అభివృద్ధి సాధించడం అంటే అంతా అభివృద్ధి సాధించడం. అలాగే దేశం ప్రగతి సాధిస్తే పౌరులు అందరూ వృద్ధి సాధించినట్లు. ఈ మాటలను ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎస్ ఆర్ నారాయణమూర్తి చెప్పారు. విశాఖలోని ఏయూలో జరిగిన పూర్వ విద్యార్ధుల సమావేశంలో ఆయన ముఖ్య అథిదిగా పాల్గొని కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
భారత్ ఆర్ధిక శక్తిగా మార్పు చెందాలని ఆయన ఆకాంక్షించారు. అయితే దానికి అంతా కృషి చేయాల్సి ఉందని అన్నారు. సమాజం అందినే గౌరవం విలువైనదని, దాన్ని కాపాడుకోవాలని ఆయన యువతకు సూచించారు. యువత ముందుగా తమలోని అహంకారాన్ని పక్షపతాన్ని జయించాలని ఆయన సూచించారు.
దేశభక్తితో కూడిన అందించిన విద్య గొప్పదని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో యువ శక్తి అపారమని నారాయణమూర్తి అంటూ తాను కలలు కన్న దేశాన్ని సాధించే సత్తా ఈనాటి యువతరానికే ఉంది అని స్పష్టం చేశారు. దేశం విజయాన్ని తమ విజయంగా యువత భావించాలని ఎపుడూ దేశం కోసం పనిచేయాలని ఆయన ఉద్భోదించారు.