ఆంధ్రజ్యోతి వార్తలు ఒక్కోసారి ఎంత నవ్వులాటగా వుంటాయంటే ఊహించలేం. వారంలో కొత్త బార్ పాలసీ అని శనివారం ఒక వార్త వచ్చింది. అయితే కొత్తగా లైసెన్స్ తీసుకోవాలని అనుకుంటున్న బార్ యజమానులు గందరగోళంలో వున్నారట. ఎందుకంటే తీరా లైసెన్స్ తీసుకున్న తర్వాత ఎన్నికలకి ముందు వైసీపీ మద్యనిషేధం ప్రకటిస్తే తమ గతేంటని భయపడుతున్నారట.
సాంబార్‌లో రకరకాల కూరగాయలు వేసి వండినట్టు జ్యోతి కూడా ఇలా తలాతోక లేని వార్తల్ని వండుతూ వుంటుంది. ఒకవైపు రాబోయే సంవత్సరాలలో ఎక్సైజ్‌లో వచ్చే ఆదాయాన్ని కూడా గ్యారెంటీగా చూపి జగన్ అప్పులు తెచ్చుకున్నాడని వీళ్లే రాశారు. మందు ఆదాయం లేకపోతే ప్రభుత్వం నడవదని కూడా ఎన్నోసార్లు రాశారు.
మరి అంతగా ఆధారపడిన జగన్ నిషేధం ఎందుకు విధిస్తాడు? ఒకవేళ విధిస్తే అది ఎన్నికల డ్రామా అని తెలియనంత మూర్ఖులా జనం? ఎన్నికల స్టంట్‌ని జనం గుర్తించలేరనుకునేంత అమాయకుడా జగన్?
ప్రభుత్వం ఇస్తుంది కదా అని ఆవేశపడి తీసుకుంటే భవిష్యత్‌పై నమ్మకం వుండదని వైసీపీ మద్దతుదారులైన వ్యాపార వర్గాలే అంటున్నాయట. అందుకే పోటీ లేదట.
పోటీ లేనప్పుడు, ఆదాయం కోసం ఎవడో ఒకడికి ఇస్తారు కానీ, మద్దతుదారులకే ఇవ్వాలని ఎందుకనుకుంటారు? పోటీనే లేనప్పుడు ఇటీవల ఒక్కోబార్‌కి పది లక్షల ముడుపులు ఎలా వసూలు చేస్తారు?
ఏదో ఒకటి జగన్‌కి వ్యతిరేకంగా వార్త రాస్తే చాలు ఆ రోజు టార్గెట్ పూర్తి అయిపోతోంది.