జ‌గ‌న్ సంక్షేమంః ఒక్క ఇంటికే రూ.52 ల‌క్ష‌ల ల‌బ్ధి

తాను అధికారంలోకి వ‌స్తే, న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల‌తో ల‌క్షాధికారుల‌ను చేస్తాన‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే…

తాను అధికారంలోకి వ‌స్తే, న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల‌తో ల‌క్షాధికారుల‌ను చేస్తాన‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే వెళుతున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి కుటుంబం ఏదో ర‌క‌మైన ల‌బ్ధి పొంద‌డాన్ని ప్ర‌జాప్ర‌తినిధులు గుర్తించారు. త‌మ ఆనందాన్ని అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులతో ల‌బ్ధిదారులు సంతోషంగా పంచుకుంటున్నారు.

తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఇవాళ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఓ కుటుంబం ఏకంగా రూ.52 ల‌క్ష‌లు ల‌బ్ధి పొందిన విష‌యాన్ని తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ కుటుంబం ఆనందానికి అవ‌ధుల్లేని వైనాన్ని భూమ‌న గుర్తించారు. మ‌రోసారి జ‌గ‌నే రావాల‌ని ఇలాంటి ల‌బ్ధిదారులు కోరుకోవ‌డం విశేషం.

తిరుప‌తి క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ శిరీష‌, డిప్యూటీ మేయ‌ర్లు ముద్ర నారాయ‌ణ‌, భూమ‌న అభిన‌య్‌ల‌తో క‌లిసి గిరిపురంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని ఎమ్మెల్యే చేప‌ట్టారు. ఒక్కో కుటుంబం రూ.10 ల‌క్ష‌లు, రూ.20 ల‌క్ష‌ల‌కు త‌క్కువ కాకుండా న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు ఇత‌ర‌త్రా ప్ర‌భుత్వం ద్వారా ల‌బ్ధి పొంద‌డాన్ని గుర్తించారు. గ‌రిష్టంగా ఓ కుటుంబం రూ.502 ల‌క్ష‌లు ల‌బ్ధి పొందామ‌ని ఎమ్మెల్యే దృష్టికి స‌ద‌రు కుటుంబం తీసుకెళ్లింది.  

గిరిపురంలో మునెమ్మ కుటుంబ సభ్యులకు  రూ.50 లక్షలకు పైగా ఆర్థిక సహాయం అందింది. మునెమ్మకి 8,82, 420 రూపాయలు, కూతురు దుర్గాకి 8,53,420 రూపాయలు, మరో కుమార్తె కుమారికి 8,79, 000 రూపాయలు, ఇంకో కుమారై జ్యోతికి 9,29,375 రూపాయలు, మరో అమ్మాయి సుజాతకు 8,82,420 రూపాయలు, ఇంకో అల్లుడు మురళికి  8,50, 000  ఆర్థిక సహాయం అందడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. తమ సంతోషాన్ని కరుణాకర రెడ్డితో పంచుకున్నారు.

మహాలక్ష్మీ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందింది. మహాలక్ష్మికి 8,82,506 రూపాయలు, కుమార్తె ఆదిలక్ష్మికి 8,30,256 రూపాయలు, మరో కుమార్తె దేశమ్మకు 9,07,330 రూపాయలు , కుమారుడికి 51 వేల రూపాయలు ఆర్థిక లబ్ధి చేకూరింది. అలాగే భార్గవికి 9,04,000, ఆమె కోడలు శైలజకు 1,03,735 రూపాయలు  లబ్ధి చేకూరింది.

సుబ్రమణ్యం కు 10,78,600 రూపాయలు, భువనేశ్వరి 10,20,631 రూపాయలు, మునీశ్వరికి 10,30,785 రూపాయలు, లక్ష్మికి 9,69,500, మునెమ్మ కు 9,55,710 రూపాయలు, రఘునాథ్‌కు 9,30,750 రూపాయలు, గిరీష్‌కు 9,16,906 రూపాయలు, రాజేశ్వరమ్మ కు 9,31,750 రూపాయలు, కస్తూరి కి 9,53,567 రూపాయలు, శాంతి కి 9,35,567 రూపాయలు, రేణుక 9,32,000 రూపాయలు, శాంతికి 9,18,769 రూపాయలు ….ఇలా మూడేళ్ల పాల‌న‌లో ల‌బ్ధిదారుల‌పై డ‌బ్బు వ‌ర్షం కురిసింద‌నేందుకు ఇవే ఉదాహ‌ర‌ణ‌లు. ఇలాంటి వాళ్లంతా జై జ‌గ‌న్ అని నిన‌దిస్తున్నారు. మ‌రోసారి జ‌గ‌నే రావాల‌ని కోరుకుంటున్నారు.