జగన్‌ది అధర్మ యుద్ధమని తరచూ చంద్రబాబు అంటూ వుంటాడు. రాజకీయాల్లో ధర్మాధర్మాలు ఉండవని అందరికంటే బాబుకే బాగా తెలుసు. ఎందుకంటే 40 ఏళ్లుగా ఆయన రాజకీయం అదే.
1) 1983లో మామకి తొడగొట్టి, జ్యోతిలక్ష్మి వచ్చినా జనాలు వస్తారని కామెంట్ చేసి, టీడీపీ పవర్లోకి వస్తే దొంగలా పార్టీలో దూరడం ధర్మమా?
2) అప్పటి వరకూ పార్టీ కోసం పనిచేసిన దగ్గుబాటి, ఉపేంద్ర ఇలా చాలా మందికి పొగపెట్టడం ధర్మమా?
3) కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు జెడ్పీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిని నిలబెట్టి పార్టీకి ద్రోహం చేయడం ధర్మమా?
4) ముసలితనంలో తోడు కోసం ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటే, తల్లిలా గౌరవించాల్సిన స్త్రీని రాష్ట్రానికి విలన్‌గా చూపడం ధర్మమా?
5) ఎన్టీఆర్ మీదే చెప్పులు వేయించడం ధర్మమా?
6) పార్టీలో ఎన్టీఆర్ ఫొటోనే లేకుండా చేయడానికి ప్రయత్నించి, చివరికి వీలుకాక అవసరార్థం మహాపురుషుడని కీర్తించడం ధర్మమా?
7) ఎన్టీఆర్ కుటుంబాన్ని కరివేపాకులా తీసి విసిరి పడేయడం ధర్మమా?
8) జూనియర్ ఎన్టీఆర్ ఎదిగితే లోకేశ్‌కి అడ్డు వస్తాడని పార్టీ వైపు రాకుండా చేయడం ధర్మమా?
9) వైసీపీని చీల్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కుట్ర చేయడం ధర్మమా?
10) మీ రాజకీయ ఎదుగదలకి సహకరించిన ప్రతి ఒక్కర్నీ అణగదొక్కడం ధర్మమా?
ధర్మం బాబు డిక్షనరీలోనే లేదు. పులి వేదాంతం చెప్పినట్టు, సింహం అహింస బోధ చేసినట్టు, తోడేలు రుద్రాక్షమాల ధరించినట్టు వుంటుంది బాబు ధర్మం మాట్లాడితే!