ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కిందా మీదా అవుతోంది ఆహా చాట్ షో అన్ స్టాపబుల్. సరైన గెస్ట్ లు దొరకడం లేదు. చంద్రబాబు తో చేసిన ఎపిసోడ్ వల్ల విమర్శలు వచ్చాయి తప్ప, ఆహాకు ఫలితం దక్కలేదు. తరువాత సరైన గెస్ట్ పడలేదు. ఇలాంటి టైమ్ లో బాహుబలి ప్రభాస్ దొరికాడు.
తొలిసారి అన్ స్టాపబుల్ చాట్ షోకి సంబంధించి ఏకంగా మూడు నిమషాల పైన ప్రోమో కట్ చేసి వదిలారు. ప్రభాస్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు, అందరి ఫ్యాన్స్ ను అలరించేలా వుంది ఈ ప్రోమో కట్.
ప్రభాస్ చాలా నాచురల్ గా తన దైన స్టయిల్ లో చేసిన సందడి మామూలుగా లేదని ప్రోమో కట్ నే చెప్పేసింది. రాణి గురించి ఏదో వుందని షో లో పాల్గొన్న హీరో గోపీచంద్ అనడం, రామ్ చరణ్ అలాంటిదే ఏదో చెప్పాడన్న హింట్ ఇవ్వడం ఎపిసోడ్ మీద ఆసక్తిని పెంచింది.
సాధారణంగా అన్ స్టాపబుల్ లో గెస్ట్ ల కన్నా బాలయ్య హడావుడి ఎక్కువగా వుంటుంది. కానీ ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ లో మాత్రం ప్రభాస్ మార్కులు కొట్టేసాడు. విడుదలైన ప్రోమో వైరల్ అయిపోతోంది. అది యూ ట్యూబ్ లో వుంది కనుక. కానీ ఎపిసోడ్ చూడాల్సింది మాత్రం ఆహా లోనే. చంద్రబాబు ఎపిసోడ్ ను పెద్ద టీవీలు పెట్టి ఊళ్లలో వేసేసినట్లు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అలాంటిది ఏదో చేస్తారేమో?