రాజధాని నిర్మాణంలో జరిగిన అవకతవకలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కమిటీ తన అధ్యయనాన్ని పూర్తిచేసింది. అందుకు సంబంధించి మరో మూడు నాలుగు రోజుల్లో నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించబోతోంది కమిటీ. ఆ నివేదిలో అత్యంత ఆసక్తిదాయకమైన విషయాలున్నాయని తెలుస్తోంది. రాజధాని పేరుతో ఏ రేంజ్ లో దోపిడీ జరిగిందో కమిటీ తేల్చిందని సమాచారం. కొన్ని కొన్ని విస్మకరమైన విషయాలు ఇప్పటికే వెలుగు చూశాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి…
-సాధారణంగా పెద్ద పెద్ద నగరాల్లో కూడా బిల్డర్లు అపార్ట్ మెంట్లు, భారీ భవంతులు నిర్మించడానికి వెచ్చిస్తున్న మొత్తం చదరపు అడుగుకు మూడువేల రూపాయల నుంచి ఐదువేల రూపాయల వరకూ ఉంది. హైదరాబాద్ లో పెద్ద పెద్ద మాల్స్ కు పెడుతున్న ఖర్చు చదరపు అడుగుకు ఐదు వేల రూపాయలు. అయితే ఏపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు పదివేల రూపాయల మొత్తంతో అప్పగించింది!
-స్థలం ప్రభుత్వానిదే అయినా.. చదరపు అడుగుకు పదివేల రూపాయలు ఇవ్వడం అనేది పెద్ద స్కామ్ అని స్పష్టం అవుతోంది.
-ఇక కన్సల్టెన్సీలకు ఖర్చుచేసిన మొత్తం 540 కోట్ల రూపాయలు! భవనాలను డిజైన్ చేసిన నార్మన్ ఫోస్టర్స్ కు 240 కోట్ల రూపాయలట! ఈ రేటుతో డిజైన్లు కాదు.. ఒరిజినల్ భవనాలనే నిర్మించేయవచ్చు!
ఇలాంటి విస్మయకరమైన వాస్తవాలు, రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన దోపిడీ పూర్తిగా ప్రజల ముందుకు రాబోతోందని మరి కొన్నిరోజుల్లోనే!