అబ్దుల్ కలాం వంటి మహనీయుడిని కూడా తమ రాజకీయం కోసం వాడుకోవడాన్ని వదలడం లేదు నారా ఫ్యామిలీ. ఆయన రాష్ట్రపతి కావడం తమ చలువే అని నారా తండ్రీకొడుకులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అబ్ధుల్ కలాం ఏ విషయాన్నీ దాచే వ్యక్తి కాదు. నిజాలను ధైర్యంగా ఒప్పుకునే వ్యక్తి. తన ఎదుగుదలలో తోడ్పడిన ప్రతి ఒక్కరిని నిత్యం స్మరించిన మహనీయుడు ఆయన. ఆయన ఏనాడూ చెప్పలేదు. తను రాష్ట్రపతి కావడానికి కారణం చంద్రబాబు నాయుడే అని!
ఒకవేళ చంద్రబాబు నాయుడి వల్లనే ఆయన రాష్ట్రపతి అయ్యుంటే.. ఆయన ఆ విషయాన్ని ప్రకటించుకునే వాళ్లు కూడా. అందుకు మొహమాట పడే టైపు కాదు ఆ భారతరత్న. అయితే చంద్రబాబు మాత్రం ఆయన విషయంలో తన సిఫార్సు వల్లనే ఆయన రాష్ట్రపతి అయ్యారని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అలా చెప్పుకోవడం సిగ్గుచేటు. అయితే నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు చెప్పుకోవడమే కాదు, ఆయన తనయుడు కూడా అదే చెప్పుకు తిరుగుతున్నారు.
ఇక ఏదైనా చెప్పడంలో చిన్నబాబు టాలెంట్ అందరికీ తెలిసిందే కదా! దాన్ని చూపించేశాడు. అబ్దుల్ కలాంను తన తండ్రే రాష్ట్రపతిగా చేశాడంటూ చినబాబు చెప్పుకొచ్చారు. తనను ఎమ్మెల్యేగా చేయలేకపోయినా అబ్దుల్ కలాంను చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిగా చేశారని లోకేశం చెప్పుకొచ్చారు. అయితే ఈ చెప్పుకురావడంలో యథారీతిన నోరుజారారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది.
'2012లో వాజ్ పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా ఎవరుండాలనే అంశం గురించి చంద్రబాబుగారు అబ్దుల్ కలాం పేరును సజస్ట్ చేశారు. ఆయన ఒప్పుకుంటారా.. అని వాజ్ పేయి గారు సందేహం వ్యక్తంచేయగా, అంతా నేను చూసుకుంటా అంటూ చంద్రబాబు గారు భరోసా ఇచ్చారు. వెంటనే అబ్దుల్ కలాంకు కాల్ చేసి.. ఒప్పించేశారు..' అంటూ లోకేష్ పిట్టకథ చెప్పారు. అయితే ఈ పిట్టకథ నిజంగా జరిగిందని మనమంతా నమ్మాలనేది లోకేష్ తాపత్రయం.
అయితే పప్పులోకాలేయడం అలవాటైన లోకేష్ ఈ పిట్టకథనూ సరిగా చెప్పలేదు. 2012లో వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉండటం ఏమిటి, అప్పుడు అబ్ధుల్ కలాం రాష్ట్రపతి కావడం ఏమిటి..! అనేది కామన్ సెన్స్ ఉన్నవాళ్లు వేస్తున్న ప్రశ్న. మరి 2012 ఏమిటో, అప్పుడు వాజ్ పేయి ప్రధానమంత్రి ఏమిటో, అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ కదా, అప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ఏమిటి? అనే సందేహాలకు చినబాబు, ఆయన భజన బ్యాచే సమాధానం ఇవ్వాలి!