జగన్ టూర్ తరువాత వారికి కన్ ఫర్మ్ అయిపోయిందా…?

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించి సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులకు తమ ప్రభుత్వం అందిస్తున్న పధకాల గురించి చేసిన సంక్షేమం గురించి సభలో వివరించారు.…

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించి సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులకు తమ ప్రభుత్వం అందిస్తున్న పధకాల గురించి చేసిన సంక్షేమం గురించి సభలో వివరించారు.

ఇదే సభలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర చాలా సేపు ప్రసంగించారు. ఆయన సీఎం జగన్ని పొగుడుతూ ప్రభుత్వం గిరిజనులకు నాలుగేళ్ళలో చేసిన అభివృద్ధిని డేటాతో సహా వివరించారు. అలా వేదిక మీద ఉన్న సీఎం మెప్పు పొందారు.

వచ్చే ఎన్నికల్లో సాలూరు నుంచి మరోసారి పోటీకి పీడిన రాజన్నదొరకు టికెట్ కన్ ఫర్మ్ అయింది అని అంటున్నారు. ఆయన 2004 నుంచి వరసగా పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. వైసీపీలో నిబద్ధత కలిగిన నేతగా ఉన్నారు.

ఆయనకు అందుకే ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారని అంటున్నారు. జగన్ వేదిక మీద ఉండగా ఎక్కువ సేపు ప్రసంగించే అవకాశం ఆయనకు దక్కడం అంటే హై కమాండ్ ఆశీస్సులు ఆయన మీద పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. కోరి మరీ సాలూరులో గిరిజన వర్శిటీని పెట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో రాజన్నదొరకి రాజకీయంగా మేలు చేసేందుకే అని అంటున్నారు.

కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కూడా మరోసారి పోటీకి టికెట్ కన్ ఫర్మ్ అయింది అని తెలుస్తోంది. జగన్ సాలూరు టూర్ కి ముందు రోజే ఆమె భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజుని పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. జగన్ పర్యటనలో పుష్ప శ్రీవాణి సైతం హుషార్ గా కనిపించారు. జగన్ పర్యటన నేపధ్యం లో చూసుకుంటే ఈ ఇద్దరు నేతలూ మరోసారి వైసీపీ టికెట్ దక్కించుకుని 2024 ఎన్నికల్లో పోటీ పడబోతున్నారు అని అంటున్నారు.