కుర్ కురే కోసం కొట్టుకుంటున్న జనం

కరకరలాడే కుర్ కురే తినాలని అందరికీ ఉంటుంది. 10 రూపాయలిస్తే దేశంలో ఎక్కడైనా, ఎంత చిన్న షాపులోనైనా కురు కురే ప్యాకెట్ దొరుకుతుంది. మరి అలాంటి కుర్ కురే కోసం జనం ఎగబడతారా? కర్నాటకలోని…

కరకరలాడే కుర్ కురే తినాలని అందరికీ ఉంటుంది. 10 రూపాయలిస్తే దేశంలో ఎక్కడైనా, ఎంత చిన్న షాపులోనైనా కురు కురే ప్యాకెట్ దొరుకుతుంది. మరి అలాంటి కుర్ కురే కోసం జనం ఎగబడతారా? కర్నాటకలోని ఓ గ్రామంలో మాత్రం ఎగబడతారు. ఎందుకంటే, అక్కడ కుర్ కురే ప్యాకెట్లలో కరెన్సీ నోట్లు దొరుకుతున్నాయి మరి..

అవును.. రాయచూర్ జిల్లా లింగసాగర్ తాలూకలోని హునూర్ గ్రామంలో కుర్ కురే ప్యాకెట్లలో కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. చాలా ప్యాకెట్ లో 500 రూపాయల నోట్లు దర్శనమిచ్చాయి. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన ప్యాకెట్ లో గరిష్టంగా 6 నోట్లు కూడా ఉన్నాయి. అంటే 10 రూపాయలు పెట్టి ప్యాకెట్ కొంటే, 3వేల రూపాయలొచ్చాయన్నమాట.

దీంతో గ్రామంలో ప్రజలంతా ఎగబడ్డారు. అందినకాడికి కుర్ కురే ప్యాకెట్లు కొనుగోలు చేశారు. దీంతో ఆ గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో కుర్ కురే స్టాక్ అయిపోయింది. కొంతమంది వ్యాపారస్తులు స్టాక్ అమ్మకుండా తమ దగ్గరే నిల్వలు పెట్టుకున్నారు.

ఈ ప్యాకెట్లు పంజాబ్ లో ప్యాక్ అయినట్టు చెబుతున్నారు. ఇందులోకి కరెన్సీ నోట్లు ఎలా వచ్చాయనే అంశంపై సదరు కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇవి నకిలీ నోట్లు కావని, అసలైన కరెన్సీ నోట్లేనని స్థానికులు నిర్థారించారు.