బండ్ల గణేష్ బాబు.. ఇండస్ట్రీలో ఒక మిస్టీరియస్ పర్సన్. ఇతను ఎలా బడా ప్రొడ్యూసర్ అయ్యాడనేది దశాబ్దం కిందటి మిస్టరీ. అది అలా కొనసాగుతూ ఉంది. ఇక తన వెనుక చాలా ఉందనేది బండ్ల గణేష్ చెప్పుకునేమాట. వివాదాస్పదంగా మాట్లాడే ఈయన ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా వచ్చారు. ఆత్మహత్యల చాలెంజ్ లు చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో అడ్రస్ లేదు.
ఆ సంగతలా ఉంటే.. తాజాగా బండ్ల గణేష్ ను అరెస్టు చేయడానికి మహారాష్ట్ర పోలీసులు దిగారని ఒక టాక్ నడుస్తూ ఉంది. అక్కడ కూడా ఏవో వ్యవహారాలు ఈ 'బడా ప్రొడ్యూసర్' కు అరెస్ట్ వారెంట్ వచ్చే వరకూ చేశాయట. ఆ సంగతలా ఉంటే.. బండ్ల గణేష్ పై ఉన్న చెక్ బౌన్స్ ల ఫిర్యాదులు కూడా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఈ నిర్మాతపై ఏకంగా ఎనభైకి పైగా చెక్ బౌన్స్ పిర్యాదులున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చనేది ఇండస్ట్రీలో నడుస్తున్నటాక్!
కడపజిల్లా ప్రొద్దుటూరు వాళ్లకే భారీఎత్తున బౌన్స్ అయ్యే చెక్కులను ఇచ్చాడట బండ్ల. అలాంటి వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారట. భారీఎత్తున వ్యాపారస్తులు ఉంటారు ప్రొద్దుటూరులో. అలాంటి వారి నుంచి ఇతడు అప్పులు తెచ్చాడట. సినిమాలు తీయడానికి అంటూ అప్పులు తెచ్చి..ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారని వారు వాపోతున్నారు. ఇలా ఎనభైకి పైగా చెక్ బౌన్స్ కేసులు కలిగినవారు ఇండస్ట్రీలోనే ఎవరూ లేరని, అది కేవలం బండ్ల గణేష్ కే సాధ్యం అవుతున్న ఫీట్ అని ఇండస్ట్రీలో జనాలు అంటున్నారు!