ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందా?

బాలీవుడ్ లో ప్రస్తుతానికి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది వార్ సినిమా. మొన్నటివరకు కబీర్ సింగ్ పేరిట ఉన్న ఈ రికార్డును తాజాగా వార్ మూవీ అధిగమించింది. కబీర్ సింగ్ సినిమాకు…

బాలీవుడ్ లో ప్రస్తుతానికి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది వార్ సినిమా. మొన్నటివరకు కబీర్ సింగ్ పేరిట ఉన్న ఈ రికార్డును తాజాగా వార్ మూవీ అధిగమించింది. కబీర్ సింగ్ సినిమాకు ఫైనల్ రన్ లో 278 కోట్ల రూపాయల వసూళ్లు రాగా.. ఆ మొత్తాన్ని తన 14వ రోజు రన్ తో క్రాస్ చేసింది వార్ మూవీ. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు 280 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అయితే  ఇది కేవలం హిందీ వెర్షన్ కు వచ్చిన వసూళ్లు కాదు. తమిళ, తెలుగు వెర్షన్లకు వచ్చిన వసూళ్లు కలిపితే ఇంత మొత్తం అయింది.

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వార్ సినిమానే నిలుస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మిగిలిన 2 నెలల్లో 2 పెద్ద సినిమాలు బరిలో నిలిచాయి. వీటిలో ఒకటి అక్షయ్ కుమార్ నటించిన హౌజ్ ఫుల్ 4 కాగా, ఇంకోటి సల్మాన్ ఖాన్ చేస్తున్న దబంగ్-3. హౌజ్ ఫుల్ 4 ఇదే నెలలో థియేటర్లలోకి వస్తోంది. అటు సల్మాన్ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది. వీటిలో ఏ ఒక్కటి క్లిక్ అయినా, వార్ సినిమాను అధిగమించడం పెద్ద సమస్య కాదు. మరీ ముఖ్యంగా సల్మాన్ సినిమా హిట్ అయితే, ఆ వసూళ్లు కళ్లుచెదిరేలా ఉంటాయనేది చరిత్ర చెబుతున్న నిజం.

ప్రస్తుతానికైతే బిగ్గెస్ట్ హిట్ అనే హోదాను ఎంజాయ్ చేస్తోంది వార్ సినిమా. ఇండియా అంతటా 4వేల స్క్రీన్స్ పై విడుదలైన ఈ చిత్రానికి రిలీజ్ రోజున నెగెటివ్ టాక్ వచ్చింది. యాక్షన్ ఎలిమెంట్స్ తప్ప సినిమాలో కంటెంట్ లేదని విమర్శకులు పెదవి విరిచారు. కానీ తమ సినిమాకు ఏదైతే ప్లస్ అవుతుందని మేకర్స్ భావించారో అదే జరిగింది. యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని బాగా ఎట్రాక్ట్ చేశాయి. ఫలితంగా కళ్లుచెదిరే కలెక్షన్లు రాబడుతోంది వార్.

ఓపెనింగ్ రోజుకే 53 కోట్ల 35 లక్షల రూపాయల నెట్ కలెక్ట్ చేసిన వార్ సినిమా, ఫస్ట్ వీకెండ్ కే వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మొదటివారం గడిచేసరికి 238 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 408 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఆల్రెడీ 2 వారాలు గడిచిపోవడంతో.. ఇది 500 కోట్ల రూపాయల మార్క్ అందుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!